Vaayuv Tej: మెగా వారసుడి ఫస్ట్ లుక్.. వాయువ్ తేజ్ ఫొటోను తొలిసారి షేర్ చేసిన నాగబాబు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaayuv Tej: మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు తన మనవడి ఫోటోను తొలిసారి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తన మనవడు, హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కుమారుడు వాయువ్ తేజ్ కొణిదెలను అభిమానులకు పరిచయం చేస్తూ నాగబాబు సోషల్ మీడియాలో ఓ ప్రత్యేకమైన ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగబాబు షేర్ చేసిన ఫొటోలో వాయువ్ తేజ్.. మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ కలిసి ఉన్న ఫొటోను ఆసక్తిగా చూస్తున్నట్లు కనిపిస్తున్నాడు. చిన్నారి ఫొటోతో పాటు నాగబాబు పెట్టిన క్యాప్షన్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘‘మా బుజ్జిబాబు చరిత్రను తదేకంగా చూస్తున్నాడు. ఆ కళ్లలో చెప్పని కథలు ప్రతిబింబిస్తున్నాయి. తన అద్భుతమైన పరిశీలనతో మెగా వారసత్వం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది’’ అంటూ ఆయన రాసుకొచ్చారు.
వాయువ్ తేజ్ ఫొటో తొలిసారి బయటకు రావడంతో మెగా అభిమానులు ఈ పిక్‌ను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. చిన్నారి లుక్‌పై అభిమానులు ప్రేమను కురిపిస్తున్నారు. ఇంతకుముందు వాయువ్‌కు సంబంధించిన ఫొటోలను కుటుంబ సభ్యులు పెద్దగా బయటకు తీసుకురాలేదు. దీంతో నాగబాబు షేర్ చేసిన ఈ ఫొటో ప్రత్యేకంగా నిలిచింది. ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2023లో వీరి వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది. అనంతరం 2025 సెప్టెంబర్ 10న ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు. అతడికి వాయువ్ తేజ్ కొణిదెల అనే పేరు పెట్టారు. ఇటీవల ‘కొరియన్ కనకరాజు’ సినిమా సక్సెస్ మీట్లో పాల్గొన్న చిరంజీవి కూడా వాయువ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సినిమా విజయాన్ని వరుణ్ ఖాతాలో వేయకుండా వాయువ్ తేజ్ ఖాతాలో వేయాలని సరదాగా వ్యాఖ్యానించారు. ‘‘తను మా లక్కీ చార్మ్’’ అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు నాగబాబు షేర్ చేసిన వాయువ్ ఫొటోతో మెగా అభిమానుల్లో మరింత సందడి నెలకొంది.
Also Read
- O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
తాజావార్తలు
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!