Site icon NTV Telugu

Vash Level 2: వణికిస్తున్న బ్లాక్ మ్యాజిక్.. ‘వాష్ లెవల్ 2’ ట్రైలర్

Yash Level 2

Yash Level 2

గుజరాతీ హారర్ మూవీ ‘వాష్’ విజయానికి ఇప్పుడు సిక్వేల్‌గా ‘వాష్ లెవెల్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ వేదిక ద్వారా అక్టోబర్ 22 నుంచి అంటే ఈ రోజు నుండి హిందీ మరియు గుజరాతీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. 2023లో వచ్చిన మొదటి భాగం ఫ్యాన్స్‌ను భయపెట్టడంతో, ఈ సీక్వెల్ కోసం భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 27న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే మంచి వసూళ్లను రాబట్టింది. కృష్ణదేవ్ యజ్ఞిక్ దర్శకత్వంలో, జానకి బోదివాలా, హితు కనోడియా, హితేన్ కుమార్, మోనల్ గాజ్జర్ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. కథలో ప్రత్యేక శక్తులు కలిగిన అథర్వ్ (హితు కనోడియా) తన 12 ఏళ్ల కూతురు ఆర్యా (జానకి బోదివాలా)ను డార్క్ ఫోర్స్ నుండి కాపాడతాడు.కానీ ఆ శక్తి ఆర్యాలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో భయంకరమైన సస్పెన్స్, బ్లాక్ మ్యాజిక్, సైకలాజికల్ థ్రిల్లర్ సన్నివేశాలు ప్రేక్షకులను వణికిస్తాయి.

Also Read : Bison : ‘బైసన్’ పై అనుపమ పరమేశ్వరన్ ఎమోషనల్ రియాక్షన్..

ఇక తాజాగా ఈ ‘వాష్ లెవెల్ 2’ కి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా.. వీడియో ట్రైలర్‌లో కనిపించిన దృశ్యాలు భయంకరంగా, వినూత్నంగా ఉన్నాయి. చిన్నారి ఆర్యా కావలసిన శక్తి, దానిని దుర్వినియోగం చేసే డార్క్ ఫోర్స్‌లు, తల్లిదండ్రుల కాపాడే ప్రయత్నాలు ఈ అన్ని అంశాలు కలిపి ప్రేక్షకులను సీట్లో కట్టిపడేస్తాయి. హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమా ఒక సూపర్‌ నేచురల్ రైడ్‌గా ఉండబోతోంది. త్రిల్లింగ్ బ్లాక్ మ్యాజిక్.. మూవీస్ ఇష్టపడే వారికి ఇది ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు.

 

Exit mobile version