కరోనా ఎఫెక్ట్ తగ్గిన తరువాత కూడా టాలీవుడ్ నిర్మాతలు హడావుడిగా విడుదల తేదీలను ప్రకటించడం లేదు. వారిలో థర్డ్ వేవ్ భయం, విడుదల తేదీలను లాక్ చేయడం వంటి అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాబోయే మూవీ ‘గని’ విడుదల తేదీని ప్రకటించారు. దీపావళికి రిలీజ్ అంటూ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వరుణ్ వెనుక నుండి బాక్సింగ్ గ్లోవ్స్, చేతులు పైకెత్తుతూ కనిపిస్తాడు. అయితే సినిమాను దీపావళి పండగ రోజునే విడుదల చేస్తారా ? లేదంటే అంతకుముందు రోజా ? అనే విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ డౌట్ రావడానికి కారణం ఉంది. పోస్టర్ పై దీపావళికి “గని” రిలీజ్ అన్నారు. కానీ ఎక్కడా రిలీజ్ డేట్ గురించి ప్రస్తావించలేదు.
Read Also : బిగ్ బాస్ దివికి మరో బిగ్ ఆఫర్
దీంతో మెగా అభిమానుల్లో సస్పెన్స్ మొదలైంది. నవంబర్ 4న దీపావళి పండగ. దీంతో సినిమా విడుదల ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెగా అభిమానులు ఇంకా సస్పెన్స్ ఏంటి వరుణ్ ? అని అనుకుంటున్నారు. ఇక కిరణ్ కొర్రపాటి ఈ స్పోర్ట్స్ డ్రామాకి దర్శకత్వం వహిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ టాలీవుడ్‌కి పరిచయం అవుతోంది. ఈ చిత్రంలో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి మరియు నవీన్ చంద్ర కీలక సహాయ పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ‘గని’ చిత్రంతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు.
