Site icon NTV Telugu

Varun-Tej : కొత్త లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరుణ్ తేజ్..!

Varun Tej

Varun Tej

మెగా హీరో వరుణ్ తేజ్ ఈ మధ్య కొంచెం కష్టకాలంలో ఉన్నాడు. గని, గంధీవధారి అర్జున వంటి వరుస పరాజయాలు ఆయన కెరీర్‌పై ప్రభావం చూపించాయి. దీంతో కొత్తదనంతో కూడిన సినిమాలకే వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తి దృష్టి “కొరియన్ కనకరాజు” చిత్రం పై ఉంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక యాక్షన్ కామెడీగా రూపొందుతోంది. ఇందులో వరుణ్ మరోసారి కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయిందని సమాచారం. నవంబర్ చివరి నాటికి అన్ని షెడ్యూల్స్ పూర్తవుతాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా..

Also Read : Devisri Prasad: ‘ఎల్లమ్మ’ లో దేవిశ్రీప్రసాద్ జోడిగా స్టార్ బ్యూటీ ఫిక్స్!

వరుణ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తాజాగా ఆయన విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి సైన్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ గతేడాదే ఫైనల్ అయినప్పటికీ, షూటింగ్ తేదీలు, స్క్రిప్ట్ చర్చల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు అన్ని క్లారిటీ రావడంతో, డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలుకానుందట. ప్రేమ కథ, ఎమోషనల్, స్టైలిష్ ప్రెజెంటేషన్ అని కలిపి రూపొందనున్న ఈ మూవీ వరుణ్ కెరీర్‌కు తిరిగి మంచి బూస్ట్ ఇవ్వగలదని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు ఫైనల్ దశలో ఉన్నాయి. త్వరలోనే హీరోయిన్‌, మిగిలిన నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు. వరుణ్‌ ఈసారి కథ, ఎమోషన్‌ల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా ప్లాన్ చేస్తున్నాడు. “కొరియన్ కనకరాజు” తర్వాత ఈ లవ్ స్టోరీతో మెగా హీరో మళ్లీ ఫామ్‌లోకి వస్తాడనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.

Exit mobile version