NTV Telugu Site icon

Varun Tej: నువ్వు పెద్దోడివి అవొచ్చు..కానీ నీ సక్సెస్ దేనికీ పనికి రాదు.. వరుణ్ తేజ్ ఇలా అనేశాడు ఏంటి?

Varun Tej Comments

Varun Tej Comments

కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మట్కా’. ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ హిట్ అయ్యింది. ‘మట్కా’ నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈవెంట్ లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ నిర్మాతలు విజయేంద్ర, రామ్ తాళ్లూరి ఈ సినిమాని డే వన్ నుంచి చాలా పాషనేట్ గా వర్క్ చేశారు. రిలీజ్ తర్వాత ఈ సినిమా మీకు చాలా డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఒక మాస్ సినిమా చేద్దాం, అందరికీ నచ్చే సినిమా చేద్దామని భావిస్తున్నప్పుడు కరుణ కుమార్ మట్కా కథతో వచ్చారు. తను అద్భుతమైన మేకర్. మంచి సెన్సిబిలిటీ ఉన్న డైరెక్టర్. ఆయనతో వర్క్ చేయడం నిజంగా నాకు అదృష్టంగా అనిపించింది.

Baba Siddique Murder: బాబా సిద్ధిక్ హత్యలో ప్రధాన షూటర్ అరెస్ట్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం..

నాలోని యాక్టర్ ని ఆయన పట్టుకున్నారనిపించింది. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ప్రతి సినిమా రిలీజ్ ముందు ఒక టెన్షన్ ఉంటుంది. అలా టెన్షన్ పడుతున్నప్పుడు రామ్ చరణ్ అన్నయ్య నుంచి మొన్న మార్నింగ్ ఫోన్ వచ్చింది. అన్నయ్య ఎప్పుడు ఒక ఎమోషనల్ సపోర్ట్ గా ఉంటారు థాంక్స్ చరణ్ అన్న. మా బాబాయ్. పెదనాన్న ఎప్పుడు గుండెల్లో ఉంటారు. అందరూ వాళ్ళ గురించే ఎందుకు మాట్లాడతావు అని అడుగుతారు. మా బాబాయ్, మా పెదనాన్న, మా అన్నయ్య చరణ్ గురించి నేను మాట్లాడుతా, అది నా ఇష్టం. లైఫ్ లో నువ్వు పెద్దోడివి అవ్వొచ్చు అవ్వకపోవచ్చు. కానీ నువ్వు ఎందుకు, ఎక్కడ మొదలుపెట్టావు, నీ వెనక సపోర్ట్ ఎవరు ఇచ్చారు అని నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ ఎందుకు పనికిరాదు. చిరంజీవి గారు, బాబాయ్ కళ్యాణ్ గారు, నాన్న, అన్నయ్య.. వాళ్ళు నా మసన్సులో ఉంటారు, వాళ్ళు నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు అని అన్నాడు. అయితే ఈ కామెంట్స్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే ఇక్కడ వరుణ్ ఎవరినీ ఉద్దేశించి మాట్లాడక పోయినా మెగా కాంపౌండ్ vs బన్నీ వివాదం నడుస్తోంది కాబట్టి వాటిని బన్నీకి అన్వయిస్తున్నారు నెటిజన్లు.

Show comments