ప్రముఖ యాంకర్ వర్షిణి సౌందరాజన్ ఓ భారీ ప్రాజెక్ట్ లో ఆఫర్ పట్టేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పౌరాణిక చిత్రం “శాకుంతలం. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీలో సమంత శకుంతలగా నటిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వర్షిణి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి వర్షిని సౌందరాజన్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ పాత్ర కోసం ఆమె వేసవిలో ఆమె చిత్రబృందాన్ని కలిసింది. ఆ తర్వాత తన పాత్ర కోసం లుక్ టెస్ట్ కు కూడా హాజరైంది. ఈ చిత్రంలో ఆమె సమంత అక్కినేనితో స్క్రీన్ స్పేస్ పంచుకోనుంది. వర్షిణి ఇప్పటికే తన పాత్ర కోసం షూటింగ్ ప్రారంభించింది.
Read Also : “ఏకే” రీమేక్ లో “భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్
“నా పాత్ర లేయర్డ్, మల్టిపుల్ లుక్ కలిగి ఉంది. గుణశేఖర్ లాంటి దర్శకుడి దగ్గర పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం. షూటింగ్ మొదటి రోజు. నేను ఎప్పుడూ స్టార్స్ తో పని చేయలేదు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను సమంతా అక్కినేనితో పని చేయబోతున్నాను” అంటూ ఆనందంగా తాను కూడా షూటింగ్ ప్రారంభించినట్టు వెల్లడించింది. ఇక టీవీ హోస్టె వర్షిణి ఈ చిత్రంలోనే కాకుండా రొమాంటిక్ ఎంటర్టైనర్ “మళ్ళీ మొదలైంది”లో సుమంత్ భార్యగా కనిపించబోతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారుతోంది ఈ యాంకర్.
