Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. పగడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi Movie Latest Update: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. వారణాసి సినిమా చిత్రీకరణ ఇప్పటికే దాదాపు 85 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. మిగిలిన 15 శాతం షూటింగ్‌ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం కేటాయించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాను అనుకున్న డేటుకే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్ర బృందం వర్క్ చేస్తోందట.
వాస్తవానికి దర్శకుడు రాజమౌళి సినిమాల విషయంలో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం తీసుకుంటారనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. దీంతో వారణాసి కూడా వాయిదా పడే అవకాశం ఉందని చాలామంది భావించారు. అయితే ఈసారి మాత్రం అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో రాజమౌళి ముందుకు సాగుతున్నారట. ఎలాంటి జాప్యం లేకుండా పగడ్బందీగా అన్ని ప్లాన్ చేశారట. వారణాసి 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నారు. కథ, విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు అత్యాధునిక సాంకేతికత ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.
Also Read
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
‘వారణాసి’కి సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ఐమ్యాక్స్ వెర్షన్. భారతీయ సినిమా చరిత్రలో పూర్తిస్థాయి ఐమ్యాక్స్ వెర్షన్లో రూపొందుతున్న రెండో ప్రాజెక్ట్‌గా ఈ సినిమా నిలవనుంది. భారీ స్క్రీన్‌పై అద్భుతమైన విజువల్స్‌ను ప్రేక్షకులకు అందించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. దీంతో థియేటర్లలో ఈ సినిమా అనుభూతి మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది. ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరి కాంబినేషన్ సినిమాపై ఇప్పటికే భారీ ఆసక్తిని పెంచింది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ, కెఎల్ నారాయణ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. పగడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
-
Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్‌లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!