Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్‌లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi Movie Shooting Update: భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలను మార్చేస్తుందని ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వారణాసి షూటింగ్‌కు సంబంధించి ఓ కీలక సమాచారం బయటకు వచ్చింది.
వారణాసి ప్రాజెక్ట్ షూటింగ్‌ను అక్టోబర్ నాటికి పూర్తిగా ముగించాలని డైరెక్టర్ రాజమౌళి టార్గెట్‌గా పెట్టుకున్నట్లు సమాచారం. సినిమా విడుదలకు ముందే పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి కీలక పనులకు తగినంత సమయం ఉండేలా ఆయన పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి సినిమాలు విజువల్ క్వాలిటీ, పర్ఫెక్షన్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా తెరకెక్కుతుంటాయి. అందుకే ఆయన చిత్రాల నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే వారణాసి విషయంలో మాత్రం షూటింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతి దశను ముందుగానే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను అనుకున్న తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో టీమ్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
- Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
ఇప్పటికే 2027 ఏప్రిల్ 7న వారణాసిని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సంచలన విజయాల తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం.. మరోవైపు మహేష్ బాబుతో ఆయన తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో బాబు ఇప్పటివరకు చూడని సరికొత్త గెటప్‌లో, గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్, అడ్వెంచర్, విజువల్ ఎఫెక్ట్స్‌తో రాజమౌళి తన మార్క్‌ను ఇందులో మరోసారి చూపించనున్నారు. మహేష్ స్టార్డమ్కు రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ తోడవడంతో వారణాసిపై బాక్సాఫీస్ అంచనాలు భారీగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!