Varanasi: ‘వారణాసి’ పోస్ట్‌పోన్ కాలేదట.. ఆ రోజే థియేటర్లలోకి మహేష్ – జక్కన్న మూవీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi: సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ గురించి సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అయితే గత రెండు రోజులుగా ఈ ప్రాజెక్ట్ వాయిదా పడిందంటూ, అనుకున్న సమయానికి థియేటర్లలోకి రావడం లేదంటూ నెట్టింట విపరీతమైన ప్రచారం జరిగింది. దీంతో మహేష్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా అందుతున్న సమాచారంతో ఆ రూమర్లన్నింటికీ ఒక్క దెబ్బతో తెరపడింది.
సినిమా వాయిదా పడిందంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు కుండబద్దలు కొట్టాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారమంతా కేవలం పుకార్లేనని స్పష్టం చేశాయి. అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ‘వారణాసి’ షూటింగ్ ఇప్పటికే పూర్తి కావడం విశేషం. ప్రస్తుతం భారీ స్థాయిలో హై-ఎండ్ సీజీఐ, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. రాజమౌళి ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో పకడ్బందీగా చెక్కుతున్నారని టాక్. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమా కోసం ఎక్స్‌క్లూజివ్ ఐమ్యాక్స్ రిలీజ్ విండోను కూడా మేకర్స్ లాక్ చేసేశారట. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే 2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోందని సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో ఐమ్యాక్స్ స్క్రీన్లను బ్లాక్ చేసుకుని మరీ రంగంలోకి దిగుతున్నారంటే జక్కన్న ప్లానింగ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. రిలీజ్ డేట్‌పై ఈ మాత్రం క్లారిటీ రావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలెట్టేశారు.
Also Read
తాజావార్తలు
-
Varanasi: ‘వారణాసి’ పోస్ట్‌పోన్ కాలేదట.. ఆ రోజే థియేటర్లలోకి మహేష్ – జక్కన్న మూవీ!
-
Russia-US: డీజిల్ డీల్ తర్వాత.. అమెరికా-రష్యా మధ్య మరో భారీ ఒప్పందం..!
-
Airtel Recharge Plans: Airtel కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. రూ.185, రూ.203, రూ.206.. వ్యాలిడిటీ, బెనిఫిట్స్ ఇవే!
-
Anupama Parameswaran: పెళ్లి చేసుకోవద్దని నేను ఎక్కడా చెప్పలేదు: అనుపమ
-
World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!