Varanasi: ‘వారణాసి’ పోస్ట్‌పోన్ కాలేదట.. ఆ రోజే థియేటర్లలోకి మహేష్ – జక్కన్న మూవీ!

Varanasi Latest Shooting Update

Varanasi Latest Shooting Update

Varanasi: సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ గురించి సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అయితే గత రెండు రోజులుగా ఈ ప్రాజెక్ట్ వాయిదా పడిందంటూ, అనుకున్న సమయానికి థియేటర్లలోకి రావడం లేదంటూ నెట్టింట విపరీతమైన ప్రచారం జరిగింది. దీంతో మహేష్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా అందుతున్న సమాచారంతో ఆ రూమర్లన్నింటికీ ఒక్క దెబ్బతో తెరపడింది.

సినిమా వాయిదా పడిందంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు కుండబద్దలు కొట్టాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారమంతా కేవలం పుకార్లేనని స్పష్టం చేశాయి. అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ‘వారణాసి’ షూటింగ్ ఇప్పటికే పూర్తి కావడం విశేషం. ప్రస్తుతం భారీ స్థాయిలో హై-ఎండ్ సీజీఐ, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. రాజమౌళి ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో పకడ్బందీగా చెక్కుతున్నారని టాక్. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమా కోసం ఎక్స్‌క్లూజివ్ ఐమ్యాక్స్ రిలీజ్ విండోను కూడా మేకర్స్ లాక్ చేసేశారట. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే 2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోందని సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో ఐమ్యాక్స్ స్క్రీన్లను బ్లాక్ చేసుకుని మరీ రంగంలోకి దిగుతున్నారంటే జక్కన్న ప్లానింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. రిలీజ్ డేట్‌పై ఈ మాత్రం క్లారిటీ రావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలెట్టేశారు.