Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu’s Latest Shooting Update From Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా వారణాసి షూటింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన సమాచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
బాబు షూటింగ్ దాదాపు పూర్తి:
తాజా సమాచారం ప్రకారం.. మహేష్ బాబు తన పాత్రకు సంబంధించిన టాకీ పార్ట్‌ను దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇంకా ఒక వారం రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ముఖ్యంగా బాబు పాత్రకు సంబంధించిన కీలకమైన ఇంట్రడక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నట్లు టాక్. ఈ ఇంట్రో సీన్‌ను జక్కన్న భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బాబు తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించినట్లు సమాచారం. షూటింగ్ పూర్తయ్యేలోపే డబ్బింగ్ ప్రారంభించడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసే దిశగా చిత్రబృందం ముందుకు సాగుతోంది.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ప్రియాంక, పృథ్వీరాజ్ షూటింగ్ అప్డేట్:
వారణాసిలో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌కు సంబంధించిన షూటింగ్‌పై కూడా ఓ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ప్రియాంక తన ప్రధాన పోర్షన్ల షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పృథ్వీరాజ్‌కు సంబంధించిన కీలక సన్నివేశాల టాకీ పార్ట్ కూడా పూర్తయినట్లు సినీ వర్గాల్లో టాక్. మిగిలిన చిన్నచిన్న సన్నివేశాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. పూర్తిస్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టాలని రాజమౌళి భావిస్తున్నాడట.
రామాయణం ఎపిసోడ్ VFX పూర్తి:
వారణాసిలో రామాయణానికి సంబంధించిన ఓ కీలకమైన ఎపిసోడ్ ఉండబోతోందనే వార్తలు ఇప్పటికే వైరల్‌గా మారాయి. తాజా ఇన్సైడర్ టాక్ ప్రకారం.. ఈ ప్రత్యేక రామాయణం ఎపిసోడ్‌కు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. మరోవైపు సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్ కూడా శరవేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. షూటింగ్, డబ్బింగ్, VFX, మ్యూజిక్ వంటి కీలక పనులను సమాంతరంగా కొనసాగిస్తూ.. సినిమాను అనుకున్న సమయానికి సిద్ధం చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారట.
వరుస అప్డేట్స్కు రెడీ అవుతున్న ఫ్యాన్స్:
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న వారణాసిపై ఇప్పటికే అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకుందని వస్తున్న వార్తలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. త్వరలోనే షూటింగ్‌కు సంబంధించిన కీలక పనులు పూర్తికావడంతో పాటు సినిమాకు సంబంధించిన మరిన్ని అధికారిక ప్రమోషనల్ అప్డేట్స్ కూడా వెలువడే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!