గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌పై ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే రాజమౌళి మరియు టీమ్ ఈ ఈవెంట్‌ను అత్యంత గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో అభిమానులకు ఇచ్చిన ప్రత్యేక గిఫ్ట్ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన గ్లింప్స్. ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రారంభం నుంచి చివరి ఫ్రేమ్ వరకు రాజమౌళి విజన్ స్పష్టంగా కనిపించింది. సాధారణ వాణిజ్య సినిమా గ్లో కాదు కథలోని లోతు, పాత్రల అంతర్గత ప్రయాణం, కాలాల మార్పులతో కూడిన నారేషన్ అన్నీ గ్లింప్స్‌లోనే ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చూపించారు. ముఖ్యంగా బ్లూ-గోల్డ్ టోన్, ఇంటెన్స్ అంబియన్స్, స్లో-బర్న్ స్టోరీ టెల్లింగ్ సినిమాను ఒక ప్రత్యేక ప్రపంచానికి తీసుకెళ్లాయి. అయితే అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన సీన్ మాత్రం..
Also Read : Salman Khan : ధర్మేంద్ర నా తండ్రి లాంటి వ్యక్తి.. ఆయన పూర్తిగా కోలుకుని తిరిగి వస్తారు
త్రేతాయుగ యుద్ధ సీన్.. కొన్ని సెకన్లకే పరిమితమైనా గ్లింప్స్‌లో కనిపించిన రామ–రావణ యుద్ధ సన్నివేశం సోషల్ మీడియాలో సంచలనం రేపింది. రాముడిని వానరసేన భుజాలపై ఎత్తుకుని యుద్ధానికి తీసుకెళ్తున్న ఆ విజువల్ బ్లూ షేడ్, ఎపిక్ స్కేల్, పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కలిసి ప్రేక్షకులకు నేరుగా గూస్‌బంప్స్ ఇచ్చింది. టాలీవుడ్ సినీ ప్రముఖులు, విమర్శకులు కూడా ఇదే మాట చెబుతున్నారు.. “ఈ స్థాయి విజువల్ థింకింగ్, కథా విస్తృతి ఇవన్నీ జక్కన్నకే సాధ్యం!’’ అని. ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపించబోతున్నారు. గ్లింప్స్‌లో ఆయన పూర్తి షేడ్స్ చూపించకపోయినా, వచ్చే యాక్షన్ అవతారం పూర్తిగా కొత్త స్థాయిలో ఉండబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. మహేష్ లుక్, బాడీ లాంగ్వేజ్ ఇప్పటికే అభిమానులను ఫుల్ ఎక్సైటెడ్ మూజ్‌లోకి తీసుకెళ్లాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో #VaranasiGlimpse అన్ని ప్లాట్‌ఫార్ముల్లో ట్రెండింగ్ అవుతోంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ సినిమా ప్రేక్షకులు కూడా.. “ఇలాంటి విజన్ భారతదేశంలో మరెవరికీ లేదు” “ఇది వరల్డ్ క్లాస్ లెవల్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
#Varanasi glimpse just obliterated all the trolls, THIS IS SS RAJAMOULI, THE KING OF INDIAN CINEMA pic.twitter.com/Oj6NWzW3f4
— Rick Sulgie (@Aloydinkan) November 16, 2025
