NTV Telugu Site icon

Varalaxmi Sarathkumar : ఫైనల్లీ పెళ్లి కబురు చెప్పేసింది.. వరలక్ష్మీకి కాబోయే భర్త బ్యాక్ గ్రౌండ్ ఇదే!

Varalakshmihusband

Varalakshmihusband

Varalaxmi Sarathkumar gets engaged to gallerist Nicholai Sachdev: సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె, నటి వరలక్ష్మి ఎట్టకేలకు తన అభిమానులకు ఒక శుభవార్త చెప్పింది. చాలా కాలం నుంచి సింగిల్ గా ఉంటూ వస్తున్న ఆమె వివాహం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతే కాదు ఈరోజు ఆమె తన ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ మొదట తమిళ సినిమాల్లో నటించడం మొదలు పెట్టి ఇప్పుడు తెలుగు, కన్నడ సినిమాల్లో కూడా స్టార్ నటిగా మారిపోయి అనేక సినిమాలలో నటిస్తోంది. ఇప్పుడు ఆమె ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త నిక్లాయ్ సచ్‌దేవ్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ నిశ్చితార్థం ఈరోజు కాదు నిన్ననే జరిగింది. కేవలం అత్యంత సన్నిహితులైన కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. వరలక్ష్మి కాబోయే భర్త నిక్లాయ్ సచ్‌దేవ్ ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నారు.

The Kerala Story: ఇదేందయ్యా ఇది.. ఒక్క సినిమాకి వందల మిలియన్ వ్యూసా?

వీరిద్దరూ గత 14 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఇప్పుడు తల్లిదండ్రుల అంగీకారంతో ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారని సమాచారం. అయితే వీరి వివాహం ఎప్పుడు జరగబోతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు వీలైనంత త్వరలో వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజానికి వరలక్ష్మి శరత్ కుమార్ గతంలో హీరో విశాల్ తో ప్రేమలో ఉన్నట్లు తమిళ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి. అయితే అటు విశాల్ తో పాటు వర లక్ష్మి సైతం ఎన్నోసార్లు తామ మంచి స్నేహితులమే తప్ప ఎలాంటి వేరే దుర్దేశాలు లేవని క్లారిటీ ఇచ్చారు.. అయినా సరే ఈ మేరకు ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉండేది. ఇక తెలుగులో ఆమె చేసిన సినిమాల విషయానికి వస్తే ఇటీవల రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచిన హనుమాన్ సినిమాలో ఆమె హీరోకి సోదరిగా అంజమ్మ అనే పాత్రలో నటించింది. ఆ సినిమా 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్న రోజునే ఆమె నిశ్చితార్థం చేసుకోవడం యాదృచ్ఛికం.

Show comments