కోలీవుడ్ లో సీనియర్ లిరిసిస్ట్, అద్భుతమైన కవి అయిన వైరముత్తు మరోసారి నెటిజన్స్ నోళ్లలో నానాడు. అబ్బే! ఈసారి ఏ చిన్మయి లాంటి అమ్మాయో ఆయన పేరు మీద లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు చేయలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం వైరముత్తు ఓ అందమైన సందేశం సొషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తమిళంలో ఆయన రాసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్స్ లో చర్చగా మారింది…
కొన్నాళ్ల క్రితం ‘అన్నాత్తే’ షూటింగ్ హైద్రాబాద్ లో జరుగుతుండగా తలైవా ఆరోగ్యం హఠాత్తుగా దెబ్బతిన్న సంగతి మనకు తెలిసిందే. అయితే, అప్పుడు కొద్ది రోజులు హాస్పిటల్ లో ఉన్న ఆయన డిశ్చార్జ్ అయ్యాక మళ్లీ శక్తి పుంజుకుని చెన్నైలో షూటింగ్ ముగించేశాడు. అయితే, ఇప్పుడు రజనీకాంత్ ప్రత్యేక విమానంలో యూఎస్ వెళ్లాడు. ఆయనతో పాటూ ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచీ ప్రత్యేక అనుమతి తీసుకుని ఆయన ఇండియా నుంచీ అమెరికా బయలుదేరారు.
ఆరోగ్య సమస్యల కారణంగా విదేశానికి వెళ్లిన రజనీ క్షేమం కోసం వైరముత్తు తన ట్విట్టర్ ఖాతాలో ఓ సందేశాన్ని రాశాడు. అంతే కాదు, తాను తలైవాతో ఫోన్ లో మాట్లాడానని కూడా ఆయన చెప్పాడు. ఇక రజనీకాంత్, నయనతార స్టారర్ ‘అన్నాత్తే’ రానున్న దీపావళి వేళ థియేటర్స్ వద్దకి వస్తుందని కోలీవుడ్ టాక్. చూడాలి మరి, అనుకున్న విధంగా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి ఫిల్మ్ మేకర్స్ సినిమాని బాక్సాఫీస్ వద్దకి తీసుకు రాగలరో లేదో…
చికిత్స కోసం అమెరికాకి రజనీకాంత్… వైరముత్తు ట్విట్టర్ సందేశం!
