NTV Telugu Site icon

V. N. Aditya : చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టిన హిట్ సినిమాల దర్శకుడు

Untitled Design (5)

Untitled Design (5)

టాలీవుడ్ కు మనసంతా నువ్వే, ఆట, బాస్, నేనున్నాను వంటి పలు సూపర్ హిట్ చిత్రాలను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు వీఎన్ ఆదిత్య.  లాంగ్ గ్యాప్ తర్వాత ఈ దర్శకుడు మరో  కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై, ఏయు & ఐ సమర్పణ లో డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరీన్ ట్రెసా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు కేథరీన్ ట్రెసా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కేథరీన్ ట్రెసా అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.

Also Read : AP/TG Floods : తెలుగు ప్రజలకు తమిళ నటుడి సాయం.. రూపాయి విదల్చని టాలీవుడ్ రాజా – రాణి..

ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలతో స్ట్రాంగ్ కంటెంట్ తో ఈ సినిమాను దర్శకుడు వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఎంతోమంది దేశ, విదేశాల కొత్త నటీనటులకు అవకాశం కల్పిస్తున్నారు. అమెరికన్స్‌, స్పానిష్‌ పీపుల్‌, ఆఫ్రికన్స్‌, యూరోపియన్స్‌, ఏషియన్స్‌, తమిళ్‌, కన్నడ, తెలుగు ఆర్టిస్టులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాను యూఎస్ లోని డల్లాస్‌లో చిత్రీకరిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఈ థ్రిల్లర్ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. ఈ సినిమాతో వీఎన్ ఆదిత్య సూపర్ హిట్ ఇస్తాడని, బౌన్స్ బ్యాక్ అవుతాడని టాలీవుడ్ వర్గాలు ఈ చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Show comments