NTV Telugu Site icon

Dasaradh : ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’ రీమేక్ కాదు..

Pk

Pk

టాలీవుడ్‌లో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. పవన్‌ సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చేసే హంగామా వేర్ లెవల్ లో ఉంటుంది. కానీ పవన్‌ పొలిటికల్‌ రీజన్స్ కారణంగా కొన్నేళ్లుగా అయన సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. దీంతో ఫ్యాన్స్ తమ హీరోసినిమా ఎప్పడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ నటిస్తున్న మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.

Also Read : AK : సమ్మర్ కు మైత్రీ మూవీస్ సినిమా వాయిదా..?

హరిహర వీరమల్లు, సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న OG షూటింగ్స్ తాజాగా స్టార్ట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలతో పాటు పవర్ స్టార్ నటిస్తున్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా షూట్ ను కొంతమేర చేసి పక్కన పెట్టారు. అయితే ఈ సినిమా తమిళ స్టార్ హీరో నటించిన ‘తేరి’ కి రీమేక్ అంటూ వార్తలు హల్ చల్ చేసాయి. కానీ అవి వాస్తవం కాదని తేల్చి చెప్పేసారు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తోన్న డైరెక్టర్ దశరధ్. తాజగా అయన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ” ఈ సినిమా తేరి రీమేక్ కాదు. రీమేక్ అని మిస్ కమ్యూనికేషన్ అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ చూసేటప్పుడు ఆడియెన్స్ సప్రైజ్ ఫీల్ అవుతారు. పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రేక్షకులు ఏవైతే కోరుకుంటారో అవి అన్ని ఈ సినిమాలో ఉంటాయి. ఒకప్పటి పవన్ కళ్యాణ్ సినిమాలో ఉండే ఆటిట్యూడ్, పంచ్ లు, అన్ని ఉంటాయి. ఇదోక ఫ్యాన్ మూమెంట్ సినిమా’ అని అన్నారు.

Show comments