పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ టీమ్ ఫ్యాన్స్‌కి ఒక స్టైలిష్ పోస్టర్‌తో గిఫ్ట్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, బ్లాక్‌బస్టర్ ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్‌తో ఆయన రెండో కాంబినేషన్ కావడం సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ శనివారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతున్న ట్లు సమాచారం. పవన్ కళ్యాణ్‌పై ఒక ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ను చిత్రీకరించడం ద్వారా ఈ షెడ్యూల్ మొదలు కాబోతోంది.
Also Read : Ghati : అనుష్క ‘ఘాటీ’ మూవీ పబ్లిక్ టాక్ – హిట్ కొట్టిందా?
ఈ సాంగ్ కోసం దేవి శ్రీ ప్రసాద్ మాస్ బీట్‌లు కంపోజ్ చేయగా, ఫుల్ ఎనర్జీతో నిండిన కొరియోగ్రఫీని దినేష్ మాస్టర్ అందించనున్నారు. ఫ్యాన్స్‌కి పక్కా ఫీస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమా మొత్తాన్ని ప్యూర్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నింపాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో శ్రీ లీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
