Ustaad Bhagat Singh Release Date: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఇక బాక్సాఫీస్ బద్దలే!

  • అభిమానులు ఎదురుచూస్తున్న అప్‌డేట్ రానే వచ్చేసింది
  • మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్
  • ఇక టాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలే
Ustaad Bhagat Singh Release

Ustaad Bhagat Singh Release

ఎట్టకేలకు ‘పవర్ స్టార్’ అభిమానులు ఎదురుచూస్తున్న అప్‌డేట్ రానే వచ్చేసింది. పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ వేసవి కానుకగా మార్చి 26న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: OnePlus 15R vs iQOO 15R: ఒకే ధర, సేమ్ స్పెసిఫికేషన్స్.. వన్‌ప్లస్‌ 15R, ఐకూ 15Rలో బెస్ట్ ఫోన్ ఏది?

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆయన క్యారెక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉంటుందని దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో పొలిటికల్ డైలాగ్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని ఇండస్ట్రీ టాక్. మార్చి 26న విడుదల కానుండటంతో.. సినిమాకు లాంగ్ వీకెండ్ మరియు సమ్మర్ హాలిడేస్ కలిసిరానున్నాయి. ఇటీవల ఓజీతో బ్లాక్ బస్టర్ అందుకున్న పవన్.. మరోసారి వెండితెరపై తన మార్క్ మాస్ ఎంటర్టైనర్‌ చేయడం పక్కా అనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఇప్పటికే వచ్చిన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లు నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుందో చూడాలి.