NTV Telugu Site icon

Urvashi Rautela : రికార్డ్ సాధించిన బాలయ్య బ్యూటీ..!

Urvasi

Urvasi

ప్రెజెంట్ టాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌కి ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. బాలీవుడ్ నుంచి వచ్చిన వారికి తెలుగు ఆడియన్స్, నిర్మాతలు ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. అలాగే ఊర్వశి రౌతేలాకి కూడా మనవాళ్ళు బాగా ఛాన్స్‌లు ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఎప్పుడైతే ఆమె చేసిందో, అక్కడ నుంచి ఊర్వశి దశ తిరిగిపోయింది. చిరంజీవితో కలిసి స్టేపులేయడంతో తెలుగులో వెంట వెంటనే భారీ ఆఫర్స్‌ అందుకుంది. దీంతో ప్రస్తుతం హిందీ సినిమాల కంటే తెలుగులోనే ఫుల్ బిజీ అయిన ఊర్వశి. కానీ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది ఈ ముద్దు గుమ్మ. అయితే తాజాగా ఈ బ్యూటీ ఇండియన్ సినిమా దగ్గర ఏ హీరోయిన్ సెట్ చేయని అరుదైన రికార్డ్ సెట్ చేసింది.

Also Read : Champion : మొత్తానికి నాలుగేళ్ల తర్వాత దర్శనం ఇచ్చిన స్టార్ కిడ్..

ఏంటి అంటే.. లేటెస్ట్‌గా ఊర్వశి రౌతేలా రూ.12 కోట్లు పెట్టి ఓ కార్‌ తీసుకుంది. ఇందులో పెద్ద గొప్ప ఏం‌ ఉంది అనుకోకండి. ఆమె తీసుకున్న కార్ మామూలు కార్ కాదు. ‘ఆటో మొబైల్స్’ లో ‘రోల్స్ రాయ్స్’ అనే బ్రాండ్ కార్. ఈ కార్ చాలా తక్కువమంది, అది కూడా అర్హతలు ఉన్నవారికే తమ కార్లు తయారు చేసి అందిస్తారు. అందుకే వీటి ఖరీదు అంత ఎక్కువ. అలా మన ఇండియాలో మొట్ట మొదటిగా మెగాస్టార్ చిరంజీవి తీసుకోగా, ఆ తర్వాత ప్రభాస్, రామ్ చరణ్‌, తమిళ్‌లో విజయ్ కొనుగోలు చేసాడు. కానీ ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా ఈ కారు కొనుగోలు చేయలేదు. దీంతో మొట్టమొదటిసారిగా ఈ కార్‌ని తీసుకున్నందుకు సోషల్ మీడియాలో, బాలీవుడ్ వర్గాల్లో ఊర్వశి రౌతేలా ఒక సంచలనంగా మారింది.