Site icon NTV Telugu

Samantha: ఆ వింత భామతో సమంత స్నేహం!!

Urfi Samantha

Urfi Samantha

Urfi Javed Reveals She’s Friends With Samantha Ruth Prabhu: ఉర్ఫీ జావేద్ తన తాజా షో ‘ఫాలో కర్ లో యార్‌’తో వార్తల్లో నిలుస్తోంది. షోలో ఈ సోషల్ మీడియా సంచలనం అనేక అంశాలు వెల్లడిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆమె అనేక విషయాలు మాట్లాడింది. ఈ షోలో ఉర్ఫీ చిత్ర పరిశ్రమలో తనకు మద్దతు ఇచ్చే స్నేహితులు ఎవరూ లేరని పేర్కొంది. అయితే, ఇటీవల కాలంలో ఉర్ఫీ సమంతా రూత్ ప్రభుతో వర్చువల్ ఫ్రెండ్ షిప్ చేస్తున్నట్టు వెల్లడించింది.

Devara: హైప్ ఎక్కించి చంపేలా ఉన్నారు కదరా!!

“సమంత మరియు నేను ఇన్‌స్టాగ్రామ్ స్నేహితులం. ఆమెకు నా వీడియో ఏదైనా నచ్చితే కనుక ఆమె దానిని తన స్టోరీస్ లో అప్‌లోడ్ చేసేది. దీని వెనుక ఏదో ఉద్దేశ్యం ఉందని నేను అనుకోను, ఎందుకంటే ఆమె నాకు నిజంగా మద్దతు ఇస్తోందని ఉర్ఫీ చెప్పుకొచ్చింది. ఆమె గర్ల్స్ గర్ల్. సామ్ కి నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు. కాబట్టి ఇన్‌స్టాగ్రామ్ పే బాత్ హుయ్ హై, కానీ హమారీ బాతేన్ హోతీ హై… సామ్ ఈజ్ బెస్ట్ అంటూ ఉర్ఫీ చెప్పుకొచ్చింది. ఇక అదే సంభాషణలో, బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌పై తనకు క్రష్ ఉందని ఉర్ఫీ వెల్లడించింది. “నేను తప్పక ఒప్పుకుంటాను, నాకు అర్జున్ కపూర్‌పై విపరీతమైన ప్రేమ ఉంది! మేము రెండు సార్లు పార్టీలలో కలుసుకున్నామని చెప్పుకొచ్చింది.

Exit mobile version