Devara: హైప్ ఎక్కించి చంపేలా ఉన్నారు కదరా!!
- దేవర క్రేజ్ చూస్తుంటే ఎవరికైనా మైండ్ బ్లాక్
- ఈ సినిమా పాటలకు వస్తున్న రెస్పాన్స్ కూడా ఒక రేంజ్ లో
- వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara Hype going on Creating Buzz: దేవర క్రేజ్ చూస్తుంటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అయ్యేలా అనిపిస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పాటలకు వస్తున్న రెస్పాన్స్ కూడా ఒక రేంజ్ లో ఉంది. ముఖ్యంగా మన దేశంలో కంటే ఇతర దేశాల్లో అయితే దేవర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. అమెరికాలో అనిరుధ్ చేసిన మ్యూజిక్ కన్సర్ట్‌లో దేవర పాటలకు ఊగిపోయారు ఆడియెన్స్. అందుకు సంబంధించిన వీడియోలను చిత్ర యూనిట్ కూడా షేర్ చేసుకుంది. ఇక చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్‌లో.. ఇప్పటికే 110 మిలియన్ వ్యూస్ రాబట్టి.. మ్యూజిక్ కేటగిరీలో మూడు వారాల తర్వాత కూడా టాప్ ట్రెండ్ అవుతోంది. ఇలా సోషల్ మీడియాను షేక్ చేస్తునే ఉంది దేవర. అదే సమయంలో దేవర థర్డ్ సాంగ్ అప్డేట్ కూడా వైరల్ అవుతోంది.
Naga Chaitanya: పెళ్లి అలాగే చేసుకుంటా.. నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Also Read
- ‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
- SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
- Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
- Dada : 'దాదా' మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
దేవర నుండి మూడవ లిరికల్ సాంగ్‌ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో సినిమా యూనిట్ నుంచి దీని పై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఈసారి దేవర నుంచి రాబోయే పాట ఎలా ఉండబోతుందనే ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు అభిమానులు. ఎందుకంటే.. ఈ మధ్య ఈ సాంగ్ గురించి లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి చేస్తున్న ట్వీట్లు అలా ఉన్నాయి మరి. మూడో పాట పాట కు మించిన ఆట, కన్నుల పండుగ, ఒక ఆట ఆడుకున్నాడట తారకరాముడు. ఎప్పుడని అడక్కండి ఎప్పుడొచ్చినా భీభత్సమే ❤️ పక్కా ఈ ఆల్బమ్ వేరే లెవెల్ అంతే అని ముందు ట్వీట్ చేయగా ఆ తరువాత మూడోది పాట మాత్రమే కాదు అంతకుమించి ❤️అంటూ మరో ట్వీట్ చేశారు. ఇక సాంగ్ గురించి చెప్పి హైప్ ఎక్కిస్తారు కానీ డేట్ అయితే చెప్పరు అని ఒక నెటిజన్ అడిగితే అది నాక్కూడా తెలీదురా నాయనా అయినా ఇంకెన్నాళ్లు ఆపుతారులే మహా అయితే ఓ రెండు మూడు రోజులు సెప్టెంబర్ వచ్చేస్తోందిగా అంటూ రాసుకొచ్చాడు.
ఇక ఈ మధ్య సినిమా యూనిట్ ఆయుధ పూజకు సంబంధించిన సాంగ్ ఒకటి షూట్ చేశామని.. ఆ పాటకు అంతా పోతారు అనేలా హైప్ ఎక్కించారు. అంతేకాదు.. ఓ 20-30 సెకన్ల బిట్ కూడా లీక్ అవగా.. ఆయుధ పూజ పై అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఇదే సాంగ్‌ను రిలీజ్ చేస్తారా? లేదంటే మరో కొత్త పాటను విడుదల చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది. దీంతో.. ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఏదేమైనా.. దేవర పై అంచనాలు మామూలుగా లేవనే చెప్పాలి.
తాజావార్తలు
-
Virat Kohli: “ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది”.. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
-
‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
-
CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?