Site icon NTV Telugu

Urfi Javed : బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బోల్డ్ బ్యూటీ

Urfi Javed

Urfi Javed

తాజాగా బాలీవుడ్ నటీమణి ఉర్ఫి జావేద్ లిప్ ఫిల్లర్స్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. స్క్రీన్ పై అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ఎంతో మంది నటీనటులు చిన్న చిన్న సర్జరీలు చేయించుకుంటారు. అయితే వాటిని బహిరంగంగా చెప్పడానికి చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. కానీ ఉర్ఫి మాత్రం ధైర్యంగా తన అనుభవాన్ని షేర్ చేసుకుంది.

Also Read : Kannappa : ‘కన్నప్ప’ ఓటీటీ రిలీజ్ డేట్ ..?

‘నేను లిప్ ఫిల్లర్ ట్రీట్‌మెంట్ చేయించుకున్న. అయితే అది పూర్తిగా ఫెయిల్ కావడంతో నా పెదవుల ఆకృతి మారిపోయింది. ముఖం ఉబ్బిపోయి, ఎర్రగా మారిపోవడంతో బాహ్యంగా కనిపించే రూపం పూర్తిగా నాశనం అయింది. అప్పట్లో నా రూపాన్ని చూసుకుని నేనే నవ్వుకున్నా, నేను తీసుకున్న ఆ నిర్ణయం ఎంత తప్పో తర్వాత తెలుసుకున్న. ఇప్పుడు ఆ ఫిల్లర్లను పూర్తిగా కరిగించుకున్న. మళ్లీ సహజ రూపాన్ని పొందాను. నేను చేసిన మిస్టేక్ ఎవ్వరు చేయకండి లిప్ ఫిల్లింగ్ చేయాలనుకుంటే అనుభవజ్ఞుడైన డాక్టర్ దగ్గరికి మాత్రమే వెళ్ళండి, కృత్రిమ మార్గాన్ని అనుసరించొదు’ అని సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఉర్ఫి ముఖానికి సంబంధించిన కొన్ని తాజా ఫొటోలు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె పెదాలు ఉబ్బి పోయినట్లు, ముఖం పూర్తిగా ఎర్రగా కనిపించడం గమనించవచ్చు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కూడా ఆమె నిజాయితీకి మెచ్చుకుంటున్నారు.

Exit mobile version