Site icon NTV Telugu

Andhra King Thaluka : ఆంధ్ర కింగ్ తాలూకా నుండి.. బర్త్‌డే కానుకగా ఉపేంద్ర వింటేజ్ లుక్‌

Andhra King Thaluka Upendra

Andhra King Thaluka Upendra

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న అవైటెడ్ ఎంటర్టైనర్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. దర్శకుడు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ తన అభిమాన హీరోకి వీరాభిమానిగా కనిపించబోతున్నారు. ఆ హీరోగా రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించడం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ.

Also Read : Kiss : కవిన్.. రొమాంటిక్ కామెడీ ‘కిస్’ తెలుగు ట్రైలర్ అవుట్!

నేడు ఉపేంద్ర జన్మదినం సందర్భంగా మేకర్స్ ఓ సాలిడ్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ఆయనను వింటేజ్ లుక్‌లో చూపించగా, ఇది చూసిన అభిమానులు ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. ఈ పోస్టర్‌తో ఉపేంద్ర లుక్ ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది. సమాచారం ప్రకారం, ఉపేంద్ర పాత్రలో ఇంట్రెస్టింగ్ షేడ్స్‌తో పాటు బలమైన ఎమోషనల్ సీన్స్ కూడా ఉండబోతున్నాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు హైలెట్ అవుతుందని యూనిట్ చెబుతుంది. ఇక ఈ సినిమాకు వివేక్–మెర్విన్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. భారీ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి బజ్ నెలకొంది. మొత్తనికి ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి బయటకు వస్తున్న ప్రతి అప్‌డేట్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఉపేంద్ర వింటేజ్ లుక్ మాత్రం అభిమానులకు స్పెషల్ బర్త్‌డే గిఫ్ట్‌గా నిలిచిపోయింది.

Exit mobile version