ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో “రాపో 19” ప్రాజెక్టు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ రానున్నట్టుగా ట్వీట్ చేశారు రామ్. “ఇట్స్ టైం టు హావ్ సమ్ ఆడ్రెనాలిన్ రష్… సాయంత్రం 5 గంటల వరకు వెయిట్ చేయండి’ అంటూ రామ్ ట్వీట్ చేశారు. ఇంకేముందు ఆ అప్డేట్ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తితో ఆతృతగా ఎదురు చూస్తున్నారు రామ్ అభిమానులు. మరి ఆ అప్డేట్ ఏంటో తెలియాలంటే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు వేచి ఉండాల్సిందే. ఇక కృతి శెట్టి ఈ చిత్రంలో రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. లింగుస్వామికి తెలుగులో ఇదే తొలి చిత్రం. ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.