Site icon NTV Telugu

Karthi: డిసెంబర్ 12న అన్నగారు వస్తారు

Karthi

Karthi

కార్తీకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. దాదాపుగా ఆయన చేస్తున్న అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. కార్తీ హీరోగా, తమిళ డైరెక్టర్ మలన్ కుమార్ స్వామి దర్శకత్వంలో, స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. సత్యరాజ్, రాజకీయం ఆనందరావు, శిల్పా మంజునాథ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ ఎంజీఆర్ అభిమాని అయిన ఒక వ్యక్తి తన మనవడు కార్తీకి ఎంజీఆర్‌కి స్పెషల్ కనెక్షన్ ఉందని భావిస్తూ ఉంటాడు. ఈ లైన్‌లో ఈ సినిమా రూపొందించారు.

Also Read:Tollywood : ఈ శుక్రవారం థియేటర్స్ లో 11 సినిమాలు రిలీజ్ కు రెడీ.. హిట్ కొట్టే సినిమా ఎదో?

ఇక ఇదే సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీన తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ కొద్దిసేపట్లో అనౌన్స్ చేయనున్నారు. తెలుగులో అన్నగారు వస్తారు అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఎన్టీఆర్‌ను ‘అన్నగారు’ అని ఎలా సంబోధిస్తూ ఉంటారో, తమిళంలో కూడా ఎంజీఆర్‌ను అలాగే అభిమానిస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో ఈ ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్ కరెక్ట్‌గా ఉంటుందని భావిస్తున్నట్లుగా సమాచారం.

Exit mobile version