Upasana Konidela: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌లో ఒక అద్భుతమైన దృశ్యం చోటుచేసుకుంది. సాధారణంగా క్లాస్‌గా కనిపించే మెగా కోడలు ఉపాసన కొణిదెల.. థియేటర్‌లో ఊరమాస్ రేంజ్‌లో సందడి చేశారు. స్క్రీన్‌పై రామ్ చరణ్ మాస్ ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం.. ఉపాసన థియేటర్‌లోని ఫ్యాన్స్‌తో కలిసి ఈలలు వేస్తూ, పేపర్లు గాల్లోకి ఎగరేస్తూ ఫుల్ జోష్‌లో కనిపించారు.
తండ్రితో కలిసి థియేటర్‌లో హంగామా..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో.. మెగా కోడలు ఉపాసన తన తండ్రితో కలిసి ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. థియేటర్‌లో చరణ్ టైటిల్ రోల్‌లో మాస్ లుక్‌తో ఎంట్రీ ఇవ్వగానే.. ఉపాసన తన చేతుల్లోని పేపర్లను గాల్లోకి విసిరారు. భర్త స్క్రీన్ ప్రెజెన్స్‌ను చూసి ఆమె ముఖంలో కనిపించిన ఆనందం, గర్వం మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచి సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లింది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఎంటర్‌టైనర్ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం.. అప్పుడే గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులతో ట్రెండ్ సెట్ చేస్తోంది. తాజాగా ఉపాసన థియేటర్‌లో చూపించిన జోష్ చూశాక.. థియేటర్లలో చరణ్ మాస్ ఎంట్రీకి థియేటర్లు మండిపోవడం ఖాయమని, ‘పెద్ది’ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టే అన్ని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Upasana garu is throwing papers for RC’s entry ❤️ #Peddi #Ramcharan #Upasana pic.twitter.com/9g6Ng33eES
— justin telugu (@JustinTelu59343) June 3, 2026
