Site icon NTV Telugu

UnstoppablewithNBKS4 : బాలయ్య, రామ్ చరణ్ స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్

Unstoppables4

Unstoppables4

అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఇప్పటికి ఈ స్టేజ్ పై తెలుగు, తమిళ్, మలయాళం తో పాటు బాలీవుడ్ తారలు కూడా సందరడి చేసారు. ఇక లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్ స్టాపబుల్ టాక్ షో కు అతిదిగా హాజరయ్యాడు. చరణ్ తో పాటు మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా స్టేజ్ పై సందడి చేసాడు. ఈ ఇద్దరి హీరోలతో పాటు టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు, శర్వానంద్ స్నేహితుడు విక్కీ కూడా పాల్గొన్నారు.

Also Read : DaakuMaharaaj : కింగ్ ఆఫ్ జంగిల్ ‘డాకు మహారాజ్’ ట్రైలర్ రిలీజ్

అందుకు సంబంధించి ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు మేకర్స్. రామ్ చరణ్ కు సర్ప్రైజ్ ల మీద సర్ప్రైజ్ లు ఉన్నాయని చరణ్ ను టెన్షన్ పెట్టాడు బాలయ్య. నువ్వు నాకు మెగా ఫ్యామిలీ స్టార్ వి అంటూ చరణ్ ను బాలయ్య సంభోదించడం చూడ ముచ్చటగా ఉంది. అలాగే రామ్ చరణ్ అమ్మ, నాయనమ్మ సర్ప్రైజ్ వీడియోలో మాట్లాడుతూ 2025లో మాకు ఒక మనవడు కావాలి అని కోరుతు స్పెషల్ వీడియో బైట్స్ సూపర్బ్ గా ఉన్నాయి. ఇక శర్వానంద్ తో బాలయ్య సరదా సంభాషణలు హిలేరియస్ గా ఉన్నాయని చెప్పాలి. ఇక చివర్లో దిల్ రాజు ఎంట్రీ ఇవ్వడం నాగవంశీ దెబ్బకు తట్టుకోలేక పింక్ ప్యాంటును తీసేసానని దిల్ రాజు నవ్వించాడు. ఇక ఫైనల్ టచ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తో రామ్ చరణ్ ఫోన్ కాల్ ఎపిసోడ్ కె హైలెట్ అని చెప్పొచ్చు.

Exit mobile version