NTV Telugu Site icon

UnstoppableS4 : సూర్య ఫస్ట్ క్రష్ ఏ హీరోయిన్ అంటే..?

Unstoppables4

Unstoppables4

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా జోరు మీద ఉన్నారు. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రామానికి హోస్ట్ గా కూడా చేస్తున్నారు. విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 లేటెస్ట్ గా స్టార్ట్ అయి సూపర్ హిట్ గా సాగుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ ఫినిష్ చేసుకున్న ఈ సీజన్ లో మూడవ ఎపిసోడ్ లో తమిళ హీరో సూర్యతో పాటు కంగువ మూవీ టీమ్ హాజరయ్యారు. తాజాగా ఈ ఈ శుక్రవారం నుండి సూర్య ఎపిసోడ్ ఆహా స్ట్రీమింగ్ కు ఉంచింది.

Also Read : AHA : ‘రైటర్స్ టాలెంట్ హంట్’ అనౌన్స్ చేసిన ‘ఆహా’

సూర్య , బాలయ్య సరదా సంబాషణలతో ఈ ఎపిసోడ్ సూపర్ గా సాగింది అని చెప్పాలి. సూర్య నటించిన గజినీ సినిమాలోని హృదయం ఎక్కడున్నది సాంగ్ పడుతూ, డాన్స్ చేస్తూ హోస్ట్ బాలయ్య అలరించారు. కాగా షో లో భాగంగా సూర్య తమ్ముడు హీరో కార్తీ కి కాల్ చేసారు బాలయ్య. సూర్య గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను కార్తీని అడిగి తెలుసుకునే క్రమంలో సూర్య ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసుకోవాలి అని కార్తీని అడిగారు బాలయ్య. అందుకు బదులుగా సార్ అన్నయ్యకు ఒక హీరోయిన్ అంటే చాలా ఇష్టమని అది జెంటిల్ మెన్ సినిమాలోని చికు చికు రైలే సాంగ్ లో హీరోయిన్ గౌతమి అని చెప్పాడు కార్తీ. అందుకు సూర్య రేయ్ నువ్వు కార్తీ కాదురా కత్తి రా అనిచెప్పడంతో షో క్లాప్స్ తో హోరెత్తింది.

Show comments