NTV Telugu Site icon

Unstoppable With NBK : మూడో సీజన్ షూట్ మొదలెట్టిన బాలయ్య.. గెస్ట్ ఎవరంటే..?

Untitled Design (22)

Untitled Design (22)

ఆరు పదుల వయసులో వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు బాలయ్య. ప్రసుతం బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే భారీ బడ్జెట్ సినిమాలో బాలయ్య నటిస్తున్నాడు. అలాగే తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పనులు బాలయ్య దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. అటు హిందువురం ఎమ్మెల్యే గా ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలలో తీరిక లేకుండా షూటింగ్స్ లో బిజీబిజీగా ఉంటున్నారు. అన్‌స్టాపబుల్ టాక్ షోతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. ఇప్పటికే రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్ టాక్ షో తో సెన్సేషన్ క్రియేట్ చేసాడు బాలయ్య. టాలీవుడ్ యంగ్ హీరోలతో తన అనుభవాలను పంచుకుంటూ, అలాగే ఇప్పటి యంగ్ హీరోలతో సరదాగా సంభాషిస్తూ టాక్ షో ను సువర్ హిట్ గా నిలిపాడు బాల.

Also Read : Nani : నెట్ ఫ్లిక్స్ లో సరిపోదా శనివారం తాండవం..!

కాగా అన్‌స్టాపబుల్ సీజన్ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎంతగానో ఎదురుచూసిన అభిమానుకు గుడ్ న్యూస్ తెలిపింది ఆహా. గత రెండు సీజన్స్ కంటే రాబోయే సీజన్ – 3ని మరింత గ్రాండ్ గా తీసుకు రానున్నారు మేకర్స్. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 3 షూట్ మొదలెట్టారు మేకర్స్. అయితే ఈ సారి గెస్ట్ టాలీవుడ్ నుండి కాదని మాలీవుడ్ నుండి అని తెలుస్తోంది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ తో షూట్ ఈ రోజు ప్రారంభించనున్నారు. దుల్కర్ సల్మాన్ తో పాటు చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి,నిర్మాత నాగ వంశి అన్‌స్టాపబుల్ సీజన్ 3 షూట్ లో పాల్గొనబోతున్నారు.

Show comments