NTV Telugu Site icon

Unstoppable with NBK : బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ – 3.. షూటింగ్ ఎప్పుడంటే..?

Untitled Design (99)

Untitled Design (99)

అఖండకు ముందు బాలయ్య వేరు, అఖండ తర్వాత వేరు. ఆరు పదుల వయసులో వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు బాలయ్య. ప్రసుతం బాలయ్యలా బిజీగా ఉన్న సీనియర్ హీరో లేరు. ఒక పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలలో తీరిక లేకుండా షూటింగ్స్ లో బిజీబిజీగా ఉంటున్నారు. ఇటీవల బుల్లితెరపై అడుగుపెట్టాడు బాలయ్య. రావడం రావడం బుల్లి తెరపై ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో తో సెన్సేషన్ క్రియేట్ చేసాడు బాలా.

Also Read: NagaChaitanya : నేడే అక్కినేని నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌..పెళ్లికూతురు ఎవరంటే..?

‘అన్‌స్టాపబుల్’ టాక్ షో రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. యంగ్ హీరోలతో బాలయ్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మరి ముఖ్యంగా ప్రభాస్ ఎపిసోడ్ లో బాలయ్య, ప్రభాస్ ల అల్లరి మాములుగా లేదు. కాగా మరోసారి తన అభిమానులని అన్‌స్టాపబుల్ టాక్‌షో ద్వారా అలరించడానికి రెడీ అవుతున్నారు బాలయ్య. అటు అభిమానులు కూడా ‘అన్‌స్టాపబుల్’ టాక్‌షో సీజన్ -3 ఎప్పుడు ప్రారంభిస్తారోనని ఎదురుచూస్తున్నారు. గత రెండు సీజన్స్ లో ఎందరో స్టార్ హీరోలు తమ పాత జ్ఞాపకాలను ఈ టాక్ షో ద్వారా పంచుకున్నారు.

Also Read : Power Star: OG షూటింగ్ లో పవన్ కళ్యాణ్.. ముహూర్తం ఎప్పుడంటే..?

ఈ నేపథ్యంలో సీజన్ -3 ఇంతకు ముందు వాటి కంటే భిన్నంగా, రెండు సీజన్స్ ను మించి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీయార్, నాగ చైతన్య వంటి స్టార్ హీరోలు పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్ టెయిన్మెంట్స్ నిర్మిస్తోన్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బాలయ్య. కాగా సెప్టెంబర్ లో అన్‌స్టాపబుల్ సీజన్ షూటింగ్ లో బాలయ్య అడుగుపెట్టనున్నాడు. ఈ లోగా ‘అన్‌స్టాపబుల్ సీజన్ -3 కు సంబందించి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు ఆహా యూనిట్.

Show comments