NTV Telugu Site icon

Vettaiyan : రికార్డు సృస్టించిన రజనీ ‘ మనసిలాయో’ లిరికల్ సాంగ్

Untitled Design (9)

Untitled Design (9)

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న ‘వేట్టైయాన్ – ది హంట‌ర్‌’. జై భీమ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న టీ.జే జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రజనీ సరసన మంజువారీయర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 10న భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నారు. తమిళ టాప్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్ష్ క‌ల‌యిక‌లో నాలుగో సినిమాగా ‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’. రానుంది.ఈ చిత్రం నుండి ఆ మధ్య రిలీజైన ‘మెరుపై వచ్చిండే.. మడత పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే’ ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రేక్షకుల నుండి విశేష స్పందన రాబట్టడమే కాకుండా రికార్డు వ్యూస్ తో దూసుకెళుతుంది.

Also Read : Tollywood : ప్రేక్షకుల అభిరుచి మారుతోంది.. ఇదే నిదర్శనం

తాజగా ఈ సాంగ్ యూట్యూబ్ లో 20 మిలియాన్ వ్యూస్ రాబట్టిందని, అధికారకంగా ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. రజనీతో గతంలో పేట‌, ద‌ర్బార్‌, జైల‌ర్ చిత్రాల‌కు అదిరిపోయే మ్యూజిక్ అందించిన అనిరుద్ నాలుగోసారి ర‌జినీకాంత్ వేట్టైయాన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ‘మనసిలాయో..’ అంటూ సాగే ఈ పాటకు ర‌జినీకాంత్, మంజు వారియ‌ర్ స్టెప్స్ విశేషంగా అలరించాయి. ఇందులో మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ సైతం స్టెప్పులేస్తూ క‌నిపించ‌టం విశేషం.ర‌జినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికా సింగ్‌, దుష‌రా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ భాషల్లో రిలీజ్ కానుంది.తెలుగు రిలీజ్ హ‌క్కుల‌ను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా పాట‌లు విడుద‌ల‌వుతున్నాయి

 

Show comments