స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ (పేపర్ లీక్). ఈ చిత్రం ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా వీక్షించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ: ఒక మాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి ఆ మాట వినపడాలి. అంటే నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉంది. ఆ గొంతు అందరికీ వినపడాలి. అది మనకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. దానితో ఏకీభవించు వచ్చు ఏకీభవించకపోవచ్చు. కానీ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం వుంది. అది మనం వినాల్సిన అవసరం వుంది. లేకపోతే ఏమీ జరుగుతుంది అంటే ప్రపంచంలో ఏక పక్ష ధోరణి రావడం వలన రాబోయే జనరేషన్స్ చాలా సంకుచితంగా తయారైపోతారు. అందుకని విభిన్నమైన గొంతుకలు విభిన్నమైన అభిప్రాయాలు…వీటిల్లోనే బ్యూటీ వుంది. అలాంటి ఒక పార్శ్వం, అలాంటి ఒక అందం ఆర్ నారాయణ మూర్తి గారు సొంతం. అది ఆయన తాలూకు శైలి. అది ప్రత్యేకం.
Also Read:War 2 Exclusive : కథ మార్పు.. మంచోడిగా ఎన్టీఆర్?
ఈ సినిమాకి వచ్చినప్పుడు కూడా నేను ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ఎలా వుంది అని చెప్పాలి అంటే కార్డు పడిన వెంటనే రెండున్నర గంటలపాటు సినిమా చూడాలా అని భయపడ్డాను. ఎందుకంటే కరోనా తరువాత అందరూ కూడా ఏ సినిమా అయిన ఇరవై నిమిషాలు ముప్ఫై నిమిషాలు చూడలేకపోవడం అనే ఒక ఆసహనంలో వుంది ప్రపంచం. అలాంటి సినిమా రెండు గంటలు చూస్తే అలా పరిగెత్తుకెళిపోయింది. పేపర్ లీక్ లు యూనివర్సిటీలు లేదంటే కాలేజీ రోజులు నుంచి విద్యాబోధన ఇంగ్లీషులో జరగాలా? తెలుగులో జరగాలా? విద్యార్థులు ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్స్ కోసం వెయిట్ చేయడం, అక్కడ కూడా లంచాలు ఇచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తుంటే మిగతా వాళ్ల తాలూకు స్టూడెంట్స్ నిస్పృహఇందులో ఏది కూడా మనల్ని ఇమిడేట్ గా ఉత్తేజ పరిచే అంశాలు కాదు. ఆలోచింప అంశాలు లేకపోతే నిరాశ పరిచే అంశాలు అయినప్పటికీ కూడా సినిమాని బలంగా పట్టుగా నడిపించారు. నేను కూడా ఇంజనీరింగ్ లో ప్రవేట్ కాలేజ్ లో ర్యాంక్ వచ్చింది. మేము నలుగురు పిల్లలం. మా నాన్న చదివించలేను అన్నారు. ఆయన తేలికగా చెప్పారో లేక నేను తేలికగా తీసుకున్నానో పట్టించుకోకుండా నేను బియాస్సీ చదివేశాను. కానీ ఇప్పుడు చూస్తుంటే అప్పుడున్నంత తేలికగా సమాజం లేదు మనుషులు కూడా అంత తేలికగా సుఖంగా లేరు ఎందుకంత బరువుగా వున్నారు. అంటే మనం పిల్లలమీద అంతా ఒత్తిడి పెట్టేస్తున్నాం. ఈ సినిమాలో పెట్టారు అన్నం తినే టైమ్ లో పుస్తకం చదివితే బెటర్ కదా అని మదర్ చెప్పడం ముద్ద నేను కలిపి పెడతాను నువ్వు చదువుకో అంటుంది. అంతా ఒత్తిడి పిల్లల మీద ఎందుకు పెట్టేస్తున్నారు? పిల్లల భవిష్యత్ గురించి పెద్ద వాళ్ళ వర్తమానాన్ని ఎందుకు తాకట్టు పెట్టేస్తున్నారు? ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో. అందరూ ఈ సినిమా తప్పకుండా చూడండి అని అన్నారు.
