NTV Telugu Site icon

Actress Shobhita : నటి శోభిత ఆత్మహత్యకేసులో కీలక మలుపు

Shobita

Shobita

కన్నడ సీరియల్ నటి ఆత్మహత్య కేసును లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. శోభిత మృతికి డిప్రెషన్ కారణమా? లేక భర్తతో విభేదాల? లేదా సీరియల్స్ మూవీస్ కి దూరంగా ఉండటమా?. శోభిత సుధీర్ రెడ్డి మధ్య ఇంతకీ ఏం జరిగింది? ఇలా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.

Also Read : Satya : పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ గెల్చుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్

తాజాగా ఈ కేసు కీలక మలుపు మలుపు తిరిగింది. కన్నడ నటి శోభిత ఆత్మహత్యకేసు దర్యాప్తులో భాగంగా ఆమె నివాసంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. ఆ లెటర్ లో ‘సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్’ అంటూ రాసి ఉండడంతో ఎవరిని ఉద్దేశించి రాసిందన్న కోణంలో దర్యాప్టు .స్టార్ట్ చేసారు. మాట్రిమోనీ డాట్ కామ్ ద్వారా సుధీర్ తో పరిచయం పెంచుకున్న శోభిత. సుధీర్ ను  శోభిత ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న నాటి నుంచి సీరియల్స్ సినిమాలోకి దూరంగా ఉంది శోభిత. సూసైడ్ మూడు రోజుల ముందు కూడా గోవా కు వెళ్ళొచ్చారు శోభిత, సుధీర్. గోవా లో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొన్నారు. ఆ ఫోటోలు పరిశీలించి చూడగా అందులో సంతోషంగా కనబడ్డ సుదీర్ శోభిత. ఆమె కాల్ లిస్ట్ ను చెక్ చేసి చూడగా లాస్ట్ కాల్ వాళ్ళ అక్కతో మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు. ఇక్కడ అంతా బాగుంది రెండు వారాలలో ఊరు కి వచ్చి కలుస్తాం అని శోభిత తన అక్కకు కాల్ చేసి చెప్పినట్లు తేల్చారు పోలీసులు.