Site icon NTV Telugu

అఫిషియల్ : “టక్ జగదీష్”పై నాని బిగ్ అప్డేట్ !

Tuck Jagadish is coming for Ganesh Chaturthi

నేచురల్ స్టార్ నాని “టక్ జగదీష్” మూవీపై బిగ్ అప్డేట్ అంటూ నిన్న వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దానికి కారణం నాని ట్వీట్. నాని “రేపు” అంటూ ట్వీట్ చేయడంతో ఆ విషయం ఏమై ఉంటుందా ? అనే ఆసక్తి మొదలైంది. తాజాగా ఆ సస్పెన్స్ కు తెర దించారు. ఈ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ అధికారికంగా ప్రకటించారు. గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా విడుదల విషయంపై చర్చ జరుగుతూనే ఉంది.

Read also : దసరా బరిలో “మహాసముద్రం”

ఫ్యామిలీ ఎంటర్టైనర్ “టక్ జగదీష్” గురించి ఏప్రిల్ నుండి విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 23న థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే లాక్‌డౌన్ కారణంగా మిగతా సినిమాల్లాగే ఈ సినిమా కూడా విడుదలను వాయిదా వేసుకుంది. అప్పటి నుంచి ఈ సినిమా ఒకసారి ఓటిటిలో విడుదలవుతుంది అంటే కాదు థియేటర్లలోనే విడుదల అవుతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ సినిమా ఓటిటిలోనే ఉంటుందని కన్ఫర్మ్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఫైర్ అయ్యారు. అనంతరం కూల్ అయిన వాళ్ళు నానికి సారీ చెప్పారు. రీసెంట్ గా “టక్ జగదీష్”ను ఎందుకు ఓటిటిలో విడుదల చేయాలనీ అనుకున్నారో, దానికోసం ఎంత తర్జనభర్జన పడ్డారో తెలుపుతూ ఓ సుదీర్ఘ లెటర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నిర్మాతలు. ఎట్టకేలకు ఈ రోజు సినిమా ఓటిటిలోనే విడుదలవుతుందని ప్రకటించారు.

“టక్ జగదీష్”లో నానితో రీతూ వర్మ రొమాన్స్ చేయనుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. “నిన్ను కోరి” తర్వాత నాని, శివ నిర్వాణ కాంబోలో వస్తున్న రెండవ చిత్రం “టక్ జగదీష్”. జగపతి బాబు, నాసర్, ఐశ్వర్య రాజేష్, రోహిణి ఇతర కీలక పాత్రలు పోషిస్తుండగా, సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version