విక్కీ కౌశల్ హీరోగా రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం ఛావా. మరాఠీ పోరాటయోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ముందుగా అనుకున్నట్లుగానే సినిమాని హిందీ భాషలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి అన్ని భాషల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 555 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరిన్ని వసూళ్ల దిశగా సినిమా పరుగులు పెడుతుంది. మరో పక్క ఈ సినిమాని డబ్బింగ్ చేసి తెలుగులో గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది.
Re Shoot: 10 కోట్లు బూడిదలో పోయించిన పాన్ ఇండియా స్టార్
ఇదిలా ఉండగా ఈ సినిమాలో విక్కీ కౌశల్ కోసం జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెబుతున్నాడు అనే వార్త సుమారు నాలుగు ఐదు రోజుల నుంచి సోషల్ మీడియాలో తిరుగుతోంది. అయితే అది కేవలం గాసిప్ అని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పూర్తయిందని ఎన్టీఆర్ దానికి డబ్బింగ్ చెప్పలేదని తెలుస్తోంది. కేవలం ఇది ఒక ప్రచారంగానే మిగిలిపోనుంది. అయితే ఎవరు డబ్బింగ్ చెప్పారనే విషయం సినిమా రిలీజ్ అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ నటన ఆసమాన్యమని సినిమా చూసినవారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఔరంగజేబు పాత్రలో నటించిన అక్షయ్ ఖన్నా నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. అలాగే రష్మికకు చాలా కాలం తర్వాత ఒక పద్ధతి అయిన పాత్ర దొరికిందని ఆమె అభిమానులు ఆనందిస్తున్నారు.