ఇండియన్ సినిమాలకు ట్రంప్ బిగ్‌షాక్ ఇచ్చారు. విదేశీ సినిమాలపై ట్రంప్ వంద శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు సినిమాలపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ గట్టిగా పడనుంది. అమెరికాలో విడుదల చేసే తెలుగు సినిమాలపై ఇక నుంచి వంద శాతం ట్యాక్స్ ఉండనుండగా సినిమాలు చూసే వారిపై ఆ భారం పడే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా, USలో భారతీయ సినిమా వ్యాపారం సుమారు $20 మిలియన్లకు చేరుకుంది. 100% సుంకం భారతీయ సినిమా ఆదాయాలను గణనీయంగా తగ్గిస్తుంది.
Also Read:Hyderabad: పేదల కోసం కీలక అడుగు..
కరోనా మహమ్మారికి ముందు, USలో భారతీయ సినిమా మార్కెట్ విలువ సుమారు $8 మిలియన్లు మాత్రమే. కరోనా తర్వాత, అది వేగంగా సుమారు $20 మిలియన్లకు పెరిగింది. ఇటీవల అమెరికాలో భారతీయ చిత్రాలకు ముఖ్యంగా తెలుగు సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. చాలా సినిమాలులు అక్కడ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అయితే, ట్రంప్ కొత్త ప్రకటన అమెరికాలో విడుదల కానున్న భారతీయ సినిమాలకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అయితే ఈ సుంకాలు ఎప్పటి నుంచి వర్తించేది మాత్రం వెల్లడించలేదు.
Also Read:Rashmika Mandanna: ధామా కోసం రష్మిక ‘ధమాకా’.. ఇంత హాట్గా ఉందేంట్రా?
“పిల్లవాడి నోటి నుండి మిఠాయిని లాక్కున్నట్లుగా ఇతర దేశాలు మన సినిమా నిర్మాణ వ్యాపారాన్ని దొంగిలించాయి” అని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాశారు. అసమర్థుడు, బలహీనుడు అయిన కాలిఫోర్నియా గవర్నర్ వలన అది తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. ఈ దీర్ఘకాల సమస్యను అంతం చేయడానికి, నేను అమెరికా వెలుపల నిర్మించిన చిత్రాలపై 100 శాతం సుంకం విధిస్తాను” అని ఆయన అన్నారు. ఈ సంవత్సరం మేలో ట్రంప్ కూడా ఇలాంటి ప్రకటన చేశారు. విదేశాలలో నిర్మించిన చిత్రాలపై 100 శాతం సుంకం విధిస్తామని ఆయన అన్నారు. అమెరికాలోని చిత్ర పరిశ్రమ “చాలా త్వరగా చనిపోతోంది” అని ఆయన అన్నారు.
