ఆయుష్మాన్ ఖురానా, రష్మిక హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘థామా’. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి ఆదిత్యా సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. మాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ మూవీ అక్టోబరు 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో “తుమ్ మేరే నా హుయే” పాటను విడుదల చేసింది. ఈ సాంగ్ అయితే ఒక మాస్ మసాలా నంబర్ గా కనిపిస్తోంది. ఈ సాంగ్ చూశాక రష్మిక మందన్న తన గ్లామర్‌ను పెంచుకోవడమే కాకుండా, తన డాన్స్ టెక్నీక్స్ నిరూపించుకోవడానికి, తమన్నా భాటియా వంటి డ్యాన్సర్ లకి గట్టి పోటీని ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తోంది.
Also Read:Avika Gor : అవికాగోర్ మెహందీ వేడుక.. మొదలైన పెళ్లి సందడి
హిందీలో “యానిమల్”, “పుష్ప 2”, “చావా” వంటి అనేక బ్లాక్‌బస్టర్‌లను సాధించిన తర్వాత, రష్మిక మందన్న “థామా”తో మరో భారీ సక్సెస్ పై దృష్టి పెట్టింది. ఇపసాంగ్ లో రష్మిక మందన్న తన స్టెప్పులు, మూవ్స్ తో భలే మెరిసింది. రష్మిక మందన్న తన వంపులు సొంపులు ప్రదర్శించడమే కాకుండా, తమన్నా భాటియా వంటి అసాధారణ నృత్యకారులు ప్రదర్శించే ఫ్లోర్ డ్యాన్స్ మూవ్స్ కూడా చేసింది. ‘థామా’ సినిమాలో రష్మిక మందన్న లేడీ వాంపైర్ పాత్రలో నటిస్తుంది. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ పాటలో వారిద్దరూ కనిపిస్తారు. రష్మిక మందన్న “పుష్ప 2” లో కూడా చాలా మాస్ స్టెప్పులు వేసింది. ఇప్పుడు, ఈ పాట ఆమెను తదుపరి స్థాయికి తీసుకెళ్తుందని, మాస్ తో బలమైన సంబంధాన్ని ఏర్పరుస్తుందని చెప్పొచ్చు.