NTV Telugu Site icon

Tripti Dimri : బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతోన్న త్రిప్తి

Sweety

Sweety

యానిమల్‌తో త్రిప్తి దిమ్రీ నేషనల్ క్రష్ కేటగిరిలో చేరిపోయింది. ఈ మూవీ సక్సెస్ ఎవరికైనా కలిసొచ్చింది అంటే అది ఆమెకే. త్రిప్తి కెరీర్ యానిమల్‌ కు బీఫోర్, ఆఫర్ట్‌లా ఛేంజ్ అయ్యింది. వరుస ఛాన్సులు కొల్లగొట్టడం ఒక ఎత్తేతే యంగ్ స్టార్లతో రొమాన్స్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీస్ కొట్టేయడం మరో ఎత్తు. ఈ ఇయర్ బ్యాడ్ న్యూజ్‌లో విక్కీ కౌశల్‌లో ఆడిపాడిన ఈ చిన్నది. విక్కీ విద్యా కా వో వాలా  మూవీలో రాజ్ కుమార్ రావ్‌తో రొమాన్స్ చేసింది. కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.

Also Read : Simran : 48 ఏళ్ల వయస్సులో జోరు చూపిస్తోన్న సిమ్రాన్

తన ఇమేజ్‌ డ్యామేజ్ అవుతున్న టైంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా వచ్చిన భూల్ భూలయ్యా 3  సూపర్ హిట్ కావడంతో కాస్తంత ఊపిరి పీల్చుకుంది.  ప్రజెంట్ దఢక్ 2 సెట్స్ పై ఉండగా మరో రెండు నయా ప్రాజెక్టులను ఒడిసిపడుతోంది క్రేజీ గర్ల్ త్రిప్తి. షాహిద్ కపూర్- విశాల్ భరద్వాజ్ కాంబోలో వస్తోన్న మూవీలో ఫిక్స్ అయ్యింది త్రిప్తి. దీనికి అర్జున్ ఉస్తారా అనే టైటిల్ కన్ఫమ్ చేశారు మేకర్స్. యాక్షన్ ప్యాక్ట్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నెక్ట్స్ ఇయర్ జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదే కాదు మాలీవుడ్ స్టార్ హీరో ఫహాద్ ఫజిల్‌తో జోడీ కట్టనున్నట్లు బాలీవుడ్ లో గట్టి బజ్ నడుస్తోంది. ఇలా వరుస పెట్టి యంగ్ అండ్ డైనమిక్ హీరోలతో ఛాన్సులు కొల్లగొట్టడం చూస్తుంటే.  స్టార్ హీరోయిన్‌గా ఛేంజ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకునేట్టు కనిపించట్లేదు త్రిప్తి.