NTV Telugu Site icon

Trinadha Rao : ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు.. వీడియో వదిలిన త్రినాధ రావు!

Trinadha Rao Sorry

Trinadha Rao Sorry

మహిళలందరికీ దర్శకుడు త్రినాథరావు నక్కిన క్షమాపణలు తెలిపారు. నిన్న హైదరాబాద్ ఆవాస్ హోటల్ లో జరిగిన మజాకా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో త్రినాధరావు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన మన్మధుడు హీరోయిన్ అన్షు గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఫారిన్ లో సెటిల్ అయిన ఆమె తిరిగి ఇండియా వచ్చాక ఈ పాత్ర కోసం అప్రోచ్ అయ్యామని చెప్పారు. అయితే ఆమె సన్నగా ఉండడంతో కొంచెం తిని లావు అవమని చెప్పానని, ఎందుకంటే తెలుగు వారికి కొంచెం సైజులు పెద్దగా ఉంటేనే ఇష్టపడతారని అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తెలంగాణ మహిళా కమిషన్ ఏకంగా సుమోటోగా కేసు నమోదు చేసింది. తాజాగా ఈ అంశం మీద దర్శకుడు త్రినాథరావు క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. నిన్న జరిగిన మజాకా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళల మనసులు నొప్పించిందని విషయం అర్థమైంది.

Gautham Vasudev Menon: వాళ్ళ కోసమే ఇంకా బతికి ఉన్నాను: డైరెక్టర్ గౌతమ్ మీనన్  

అయితే ఇది అందరికీ చెబుతున్నాను, నేను ఏదో నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోట్లోంచి వచ్చిన మాటలే తప్ప నేను కావాలని చెప్పింది కాదు. అయినా సరే మీ అందరి మనసులు నొప్పించాను కాబట్టి తప్పు తప్పే కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. పెద్ద మనసు చేసుకొని క్షమించండి మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. నేను అన్షు గారికి కూడా క్షమాపణలు తెలియజేస్తున్నాను, అలాగే నేను కామెడీ కోసం మా హీరోయిన్ ని ఏడిపించడం కోసం వాడిన మేనరిజంని విషయంలో కూడా చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అది కూడా కావాలని చేసింది కాదు అక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్విద్దామని అనుకున్నాను. కానీ ఇది ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని అనుకోలేదు. దయచేసి ఆ ఇష్యూ కి సంబంధించిన వారి అభిమానుల మనోభావాలను దెబ్బతీసి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు దయచేసి నన్ను పెద్దమనిషి చేసుకుని క్షమించండి అని ఆయన అన్నారు.

Show comments