Trinadha Rao : ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు.. వీడియో వదిలిన త్రినాధ రావు!
- మహిళలకి, అన్షు గారికి, మరియు నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నా: నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు
- తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే
- మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను: త్రినాధ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలందరికీ దర్శకుడు త్రినాథరావు నక్కిన క్షమాపణలు తెలిపారు. నిన్న హైదరాబాద్ ఆవాస్ హోటల్ లో జరిగిన మజాకా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో త్రినాధరావు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన మన్మధుడు హీరోయిన్ అన్షు గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఫారిన్ లో సెటిల్ అయిన ఆమె తిరిగి ఇండియా వచ్చాక ఈ పాత్ర కోసం అప్రోచ్ అయ్యామని చెప్పారు. అయితే ఆమె సన్నగా ఉండడంతో కొంచెం తిని లావు అవమని చెప్పానని, ఎందుకంటే తెలుగు వారికి కొంచెం సైజులు పెద్దగా ఉంటేనే ఇష్టపడతారని అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తెలంగాణ మహిళా కమిషన్ ఏకంగా సుమోటోగా కేసు నమోదు చేసింది. తాజాగా ఈ అంశం మీద దర్శకుడు త్రినాథరావు క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. నిన్న జరిగిన మజాకా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళల మనసులు నొప్పించిందని విషయం అర్థమైంది.
Gautham Vasudev Menon: వాళ్ళ కోసమే ఇంకా బతికి ఉన్నాను: డైరెక్టర్ గౌతమ్ మీనన్
Also Read
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
అయితే ఇది అందరికీ చెబుతున్నాను, నేను ఏదో నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోట్లోంచి వచ్చిన మాటలే తప్ప నేను కావాలని చెప్పింది కాదు. అయినా సరే మీ అందరి మనసులు నొప్పించాను కాబట్టి తప్పు తప్పే కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. పెద్ద మనసు చేసుకొని క్షమించండి మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. నేను అన్షు గారికి కూడా క్షమాపణలు తెలియజేస్తున్నాను, అలాగే నేను కామెడీ కోసం మా హీరోయిన్ ని ఏడిపించడం కోసం వాడిన మేనరిజంని విషయంలో కూడా చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అది కూడా కావాలని చేసింది కాదు అక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్విద్దామని అనుకున్నాను. కానీ ఇది ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని అనుకోలేదు. దయచేసి ఆ ఇష్యూ కి సంబంధించిన వారి అభిమానుల మనోభావాలను దెబ్బతీసి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు దయచేసి నన్ను పెద్దమనిషి చేసుకుని క్షమించండి అని ఆయన అన్నారు.
నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు, మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నా: త్రినాధ రావు #TrinadhaRaoNakkina pic.twitter.com/HR6vgnzQMU
— BhaRGV (@BhargavChaganti) January 13, 2025
తాజావార్తలు
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!