కొత్త ఏడాదికి అదిరిపోయే ఆరంభం లభించనుంది. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో, భారీ తారాగణంతో తెరకెక్కిన బహుభాషా చిత్రం ‘త్రిముఖ’ విడుదలకు ముహూర్తం ఖరారైంది. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం 2026 జనవరి 02న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ‘త్రిముఖ’ రాజేష్ నాయుడు దర్శకత్వంలో ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోందని అంటున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కాబోతోంది. అంటే, ఇది పక్కా పాన్ ఇండియా సత్తా ఉన్న చిత్రంగా కనిపిస్తోంది. విజువల్స్‌తో పాటు, కథా గమనం కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Also Read :Brahmanandam : గెటప్స్ చూసి నేను మొదట గుర్తుపట్టలేకపోయా!
ఈ సినిమాలో నటీనటుల ఎంపిక చాలా వైవిధ్యంగా ఉంది. గ్లామర్ క్వీన్ సన్నీ లియోన్‌తో పాటు యోగేష్ కాళ్లే, అకృతి అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పాపులర్ క్రైమ్ సీరీస్ ‘CID’ ఫేమ్ ఆదిత్య శ్రీవాస్తవ, హాస్యనటుడు మోటా రాజేంద్రన్, సోషల్ మీడియా సెన్సేషన్ ఆశు రెడ్డి వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీనియర్ నటులు సుమన్, జీవా, రవి ప్రకాష్‌లతో పాటు కామెడీలో తనదైన ముద్ర వేసిన షకలక శంకర్, ప్రవీణ్ కూడా ప్రేక్షకులను అలరించనున్నారు. నిర్మాతలు శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. వినోద్ యాజమాన్య సంగీతం, శ్రీను నాగపూరి సౌండ్ డిజైన్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. నూతన సంవత్సర కానుకగా వస్తున్న ‘త్రిముఖ’ ప్రచార కార్యక్రమాలను కూడా చిత్ర యూనిట్ వేగవంతం చేస్తోంది. అతి త్వరలోనే పాటలు మరియు ట్రైలర్‌ను విడుదల చేసి, అంచనాలను మరింత పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
