Krisnaveni: ఇండస్ట్రీలో విషాదం.. ఎన్టీఆర్ తొలి నిర్మాత మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తాజాగా సీనియర్ నటీమణి, నిర్మాత, స్టూడియో అధినేత శ్రీమతి మీర్జాపురం కృష్ణవేణి కన్నుమూశారు. వయోభారం సమస్యలతో కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న కృష్ణవేణి ఆదివారం (ఫిబ్రవరి 16) ఉదయం తుది శ్వాస విడిచింది. ఆమె వయసు 101 సంవత్సరాలు. సినీ పరిశ్రమకు గొప్ప వ్యక్తులను అందించిన గౌరవప్రదమైన నిర్మాతగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు 1949లో ‘మన దేశం’ అనే సినిమాతో నందమూరి తారక రామారావును తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసింది కృష్ణవేణి..అలా సీనియర్ ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాతగా ఆమె చిరస్మరణీయంగా నిలిచింది.
Also Read: Manchu Manoj: మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు..!
Also Read
- Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
- World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
- Keerthy Suresh : 41 గంటల నాన్-స్టాప్ షూటింగ్లో పాల్గొన్న కీర్తిసురేష్
- Thani Oruvan 2: రవి మోహన్, నయనతార 'తని ఒరువన్ 2' ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ఇక ‘సతీ అనసూయ’ అనే సినిమాలో 1936లో సినిమా రంగానికి పరిచయం అయ్యి.. బాల నటిగా కొనసాగుతూనే తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో నటించి మెప్పించింది కృష్ణవేణి. అలా హీరోయిన్‌గా ఉన్న టైంలోనే మీర్జాపురం రాజా వారితో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారి, వివాహ బంధం గా మారింది. వీరికి మేక రాజ్యలక్ష్మి అనురాధ జన్మించారు. అనురాధ కూడా నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలు నిర్మించింది. 2004లో కృష్ణవేణికి రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. అలాగే గత సంవత్సరం డిసెంబర్ 14న విజయవాడలో జరిగిన ఎన్.టి.ఆర్. వజ్రోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు శ్రీమతి కృష్ణవేణిని సత్కరించారు.
తాజావార్తలు
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
-
Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
-
Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
-
TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
-
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!