NTV Telugu Site icon

Krisnaveni: ఇండస్ట్రీలో విషాదం.. ఎన్టీఆర్ తొలి నిర్మాత మృతి

February 7 (94)

February 7 (94)

గత రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తాజాగా సీనియర్ నటీమణి, నిర్మాత, స్టూడియో అధినేత శ్రీమతి మీర్జాపురం కృష్ణవేణి కన్నుమూశారు. వయోభారం సమస్యలతో కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న కృష్ణవేణి  ఆదివారం (ఫిబ్రవరి 16) ఉదయం తుది శ్వాస విడిచింది. ఆమె వయసు 101 సంవత్సరాలు. సినీ పరిశ్రమకు గొప్ప వ్యక్తులను అందించిన గౌరవప్రదమైన నిర్మాతగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు 1949లో ‘మన దేశం’ అనే సినిమాతో నందమూరి తారక రామారావును తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసింది కృష్ణవేణి..అలా సీనియర్ ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాతగా ఆమె చిరస్మరణీయంగా నిలిచింది.

Also Read: Manchu Manoj: మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు..!

ఇక ‘సతీ అనసూయ’ అనే సినిమాలో 1936లో సినిమా రంగానికి పరిచయం అయ్యి.. బాల నటిగా కొనసాగుతూనే తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో నటించి మెప్పించింది కృష్ణవేణి. అలా హీరోయిన్‌గా ఉన్న టైంలోనే మీర్జాపురం రాజా వారితో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారి, వివాహ బంధం గా మారింది. వీరికి మేక రాజ్యలక్ష్మి అనురాధ జన్మించారు. అనురాధ కూడా నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలు నిర్మించింది. 2004లో కృష్ణవేణికి రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. అలాగే గత సంవత్సరం డిసెంబర్ 14న విజయవాడలో జరిగిన ఎన్.టి.ఆర్. వజ్రోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు శ్రీమతి కృష్ణవేణిని సత్కరించారు.