NTV Telugu Site icon

Yash : మరో చాప్టర్ మొదలుపెట్టిన కెజిఎఫ్ స్టార్ యష్.. దర్శకుడు ఎవరంటే..?

Untitled Design 2024 08 08t111934.793

Untitled Design 2024 08 08t111934.793

కన్నడ స్టార్ హీరో యశ్‌ నటించిన కేజీఎఫ్ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కన్నడ సినిమా స్థాయిని పెంచి, వరల్డ్ మార్కెట్ లో కన్నడ సినిమాకు డోర్స్ ఓపెన్ చేసింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ఇండియాలో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా టాప్ 5లో ఒకటిగా నిలిచింది. 2022లో వచ్చిన ఈ సినిమా తర్వాత యశ్‌మరే ఇతర సినిమాలోను నటించలేదు. ఆ మధ్య టాక్సిక్ (TOXIC) సినిమాను ప్రకటించాడు యశ్‌. కానీ షూటింగ్ మొదలు పెట్టలేదు.

Also Read : Gaddar : రిలీజ్ కు సిద్ధమైన గద్దర్ నటించిన చివరి సినిమా..

యశ్‌ అభిమానులు తమ హీరో సినిమా ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది, టాక్సిక్ సినిమా షూటింగ్ నేడు పూజ కార్యక్రమాలతో స్టార్ట్ చేసాడు ఈ కన్నడ హీరో. అందుకు సంబంధించి షూట్‌లో మొదటి రోజు ఫోటో రిలీజ్ చేశారు మేకర్స్. మొదటి షెడ్యూల్ ను బెంగళూరు, తర్వాత ముంబైలలో షూట్ చేయనున్నారు. ఈ సినిమాలోని ఎక్కువ భాగం లండన్‌లో జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో యశ్‌ సరసన తమిళ భామ నయనతార, బాలీవుడ్ నాయకి కైరా అద్వానీ కథానాయికలుగా నటించనున్నారు. మలయాళ నటుడు టామ్ చాకో, హ్యూమా ఖురేషి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా భాషలలో రానున్న ఈ సినిమాకు గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు గతంలో ప్రకటించారు.

Show comments