Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash: రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాకు తొలిరోజే మిక్సిడ్ టాక్, నెగెటివ్ రివ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రంపై ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే సినిమా గురించి వచ్చిన నెగిటీవ్ రివ్యూస్‌ను యశ్ ఎలా తీసుకున్నారన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా ‘టాక్సిక్’ చిత్రానికి డబ్బింగ్ సూపర్వైజర్గా పనిచేసిన నటుడు జైదేవ్ మోహన్.. యశ్ రియాక్షన్‌ను వెల్లడించారు. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజే నెగెటివ్ రివ్యూస్ రావడంతో యశ్ తనకు ఫోన్ చేసినట్లు జైదేవ్ మోహన్ తెలిపారు. ఆ సమయంలో యశ్ తనతో చాలా కూల్‌గా మాట్లాడారని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా విషయంలో ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యశ్ చెప్పినట్లు వివరించారు.
‘‘ఎక్కువగా బాధపడొద్దు. ఇక సినిమాను ప్రేక్షకులకే వదిలేద్దాం. వాళ్లకు నచ్చితే ఆదరిస్తారు. వాళ్ల నిర్ణయాన్ని గౌరవించాలి. మనం చేయాల్సిన పని ఇంకా ఉంది’’ అని యశ్ చెప్పినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే యశ్ మాటల్లో ధైర్యం కనిపించినప్పటికీ.. ఆయన స్వరంలో సినిమా రిజల్ట్‌పై బాధ ఉన్నట్లు స్పష్టంగా వినిపించిందని అన్నారు. ఓ సినిమా కోసం ఎంతో కష్టపడిన తర్వాత తొలిరోజే నెగిటీవ్ టాక్ రావడం హీరోతో పాటు మొత్తం టీమ్‌ను ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు. అయినప్పటికీ యశ్ మాత్రం రిజల్ట్‌ను అంగీకరిస్తూ ముందుకు వెళ్లే ధోరణిని ప్రదర్శించినట్లు చెప్పారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘టాక్సిక్’పై రిలీజ్‌కి ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్ – డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో బాక్సాఫీస్ రిజల్ట్‌పై దాని ప్రభావం పడిందనే వార్తలు వచ్చాయి. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. నెగెటివ్ రివ్యూస్ వచ్చినా యశ్ స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రేక్షకుల తీర్పును గౌరవిస్తూ తన పనిపై ఆయన దృష్టి పెట్టాలన్న మాటలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Also Read
- Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
- Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
- The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
- Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
తాజావార్తలు
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
-
Jawa 42 All Stars Edition: జావా 42 ఆల్ స్టార్స్ ఎడిషన్ బైక్ లాంచ్.. 27.1hp పవర్, డ్యూయల్ ఛానల్ ABS, ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!