Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash: రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాకు తొలిరోజే మిక్సిడ్ టాక్, నెగెటివ్ రివ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రంపై ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే సినిమా గురించి వచ్చిన నెగిటీవ్ రివ్యూస్‌ను యశ్ ఎలా తీసుకున్నారన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా ‘టాక్సిక్’ చిత్రానికి డబ్బింగ్ సూపర్వైజర్గా పనిచేసిన నటుడు జైదేవ్ మోహన్.. యశ్ రియాక్షన్‌ను వెల్లడించారు. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజే నెగెటివ్ రివ్యూస్ రావడంతో యశ్ తనకు ఫోన్ చేసినట్లు జైదేవ్ మోహన్ తెలిపారు. ఆ సమయంలో యశ్ తనతో చాలా కూల్‌గా మాట్లాడారని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా విషయంలో ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యశ్ చెప్పినట్లు వివరించారు.
‘‘ఎక్కువగా బాధపడొద్దు. ఇక సినిమాను ప్రేక్షకులకే వదిలేద్దాం. వాళ్లకు నచ్చితే ఆదరిస్తారు. వాళ్ల నిర్ణయాన్ని గౌరవించాలి. మనం చేయాల్సిన పని ఇంకా ఉంది’’ అని యశ్ చెప్పినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే యశ్ మాటల్లో ధైర్యం కనిపించినప్పటికీ.. ఆయన స్వరంలో సినిమా రిజల్ట్‌పై బాధ ఉన్నట్లు స్పష్టంగా వినిపించిందని అన్నారు. ఓ సినిమా కోసం ఎంతో కష్టపడిన తర్వాత తొలిరోజే నెగిటీవ్ టాక్ రావడం హీరోతో పాటు మొత్తం టీమ్‌ను ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు. అయినప్పటికీ యశ్ మాత్రం రిజల్ట్‌ను అంగీకరిస్తూ ముందుకు వెళ్లే ధోరణిని ప్రదర్శించినట్లు చెప్పారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘టాక్సిక్’పై రిలీజ్‌కి ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్ – డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో బాక్సాఫీస్ రిజల్ట్‌పై దాని ప్రభావం పడిందనే వార్తలు వచ్చాయి. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. నెగెటివ్ రివ్యూస్ వచ్చినా యశ్ స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రేక్షకుల తీర్పును గౌరవిస్తూ తన పనిపై ఆయన దృష్టి పెట్టాలన్న మాటలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Also Read
- JoJo : మనోభావాల బ్యాచ్‌కు మరోసారి షాకిచ్చిన ‘జో జో’ టీమ్
- Prabhas Birthday: వంగా స్టైల్లో డార్లింగ్ బర్త్‌డే.. ‘స్పిరిట్’ పిక్ చూశారా!
- Maruthi: ‘రాజాసాబ్’ గాయం ఇంకా మానలేదా? మారుతిని ఆడుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!
- Vishwak Sen: తరుణ్ భాస్కర్‌ను ‘ఫలక్‌నుమా దాస్’ కోసం 3 నెలలు అడుక్కున్నా..: విశ్వక్ సేన్
తాజావార్తలు
-
DK Shivakumar: ‘‘కాంగ్రెస్ వల్లే మోడీ ప్రధాని అయ్యారు’’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
-
JoJo : మనోభావాల బ్యాచ్‌కు మరోసారి షాకిచ్చిన ‘జో జో’ టీమ్
-
Gopireddy Srinivasa Reddy: వైసీపీ సంచలన నిర్ణయం.. నర్సరావుపేటలో ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
-
Prabhas Birthday: వంగా స్టైల్లో డార్లింగ్ బర్త్‌డే.. ‘స్పిరిట్’ పిక్ చూశారా!
-
Hyderabad : పండుగ వేళ ‘తీపి’ విషం: నగరంలో స్వీట్ షాపుల బరితెగింపు.. TG-SAFE కొరడా!
ట్రెండింగ్
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!