Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic OTT Deal Buzz: కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. యశ్ కెరీర్లోనే టాక్సిక్ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.340 కోట్లు వసూల్ చేసింది. అయితే ఈ మూవీ రిలీజై నెల రోజులు దాటినా.. ఇప్పటి వరకు ఓటీటీ విడుదలకు నోచుకోలేదు. థియేటర్ రెస్పాన్స్ చూశాక ఓటీటీలు సైతం వెనకడుగు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాక్సిక్ ఓటీటీ డీల్‌కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
టాక్సిక్ సినిమా ఓటీటీ హక్కుల కోసం గతంలో రూ.150 కోట్ల ఆఫర్ వచ్చినప్పటికీ.. యష్ దానిని తిరస్కరించాడట. పైగా డిజిటల్ హక్కుల కోసం ఏకంగా రూ.200 కోట్లు ఆశించాడట. దీంతో టాక్సిక్ ఓటీటీ డీల్‌పై అప్పట్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ డీల్ విషయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓటీటీ సంస్థ నుంచి కేవలం రూ.30 కోట్ల ఆఫర్ మాత్రమే వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మొత్తంలోనూ 50 శాతం మాత్రమే ముందస్తుగా చెల్లించి.. మిగిలిన మొత్తాన్ని పే-పర్-వ్యూ విధానంలో చెల్లించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
టాక్సిక్ సినిమా ఓటీటీ రైట్స్ జీ5 సొంతం చేసుకుందని గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు.. థియేటర్ రిజల్ట్ చూశాక ఓటీటీ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి. రూ.200 కోట్ల నుంచి ఏకంగా రూ.30 కోట్లకు డీల్ పడిపోయింది. రూ.30 కోట్ల ఆఫర్‌కు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు. మరి ఈ సినిమాను ఏ ఓటీటీ సంస్థ కొనుగోలు చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!