Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?

Toxic (2)

Toxic (2)

Toxic OTT Deal Buzz: కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. యశ్‌ కెరీర్‌లోనే టాక్సిక్ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.340 కోట్లు వసూల్ చేసింది. అయితే ఈ మూవీ రిలీజై నెల రోజులు దాటినా.. ఇప్పటి వరకు ఓటీటీ విడుదలకు నోచుకోలేదు. థియేటర్ రెస్పాన్స్ చూశాక ఓటీటీలు సైతం వెనకడుగు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాక్సిక్‌ ఓటీటీ డీల్‌కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

టాక్సిక్ సినిమా ఓటీటీ హక్కుల కోసం గతంలో రూ.150 కోట్ల ఆఫర్ వచ్చినప్పటికీ.. యష్ దానిని తిరస్కరించాడట. పైగా డిజిటల్ హక్కుల కోసం ఏకంగా రూ.200 కోట్లు ఆశించాడట. దీంతో టాక్సిక్ ఓటీటీ డీల్‌పై అప్పట్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ డీల్ విషయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓటీటీ సంస్థ నుంచి కేవలం రూ.30 కోట్ల ఆఫర్ మాత్రమే వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మొత్తంలోనూ 50 శాతం మాత్రమే ముందస్తుగా చెల్లించి.. మిగిలిన మొత్తాన్ని పే-పర్-వ్యూ విధానంలో చెల్లించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

టాక్సిక్ సినిమా ఓటీటీ రైట్స్ జీ5 సొంతం చేసుకుందని గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు.. థియేటర్ రిజల్ట్ చూశాక ఓటీటీ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి. రూ.200 కోట్ల నుంచి ఏకంగా రూ.30 కోట్లకు డీల్ పడిపోయింది. రూ.30 కోట్ల ఆఫర్‌కు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు. మరి ఈ సినిమాను ఏ ఓటీటీ సంస్థ కొనుగోలు చేస్తుందో చూడాలి.