Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఫ్లాప్ అయినా, హిట్ అయినా ఆ క్రెడిట్ డైరెక్టర్‌దే. ‘టాక్సిక్’ డిజాస్టర్ టాక్ తర్వాత డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది. అంతా నువ్వే చేశావంటూ తెగ ఆడేసుకుంటున్నారు. టాక్సిక్ తో ఏం చెప్పాలనుకుందో డైరెక్టర్‌కి కూడా తెలీదు. కథ ఎలాగూ లేదు, చెప్పుకోవడానికి సరైన స్టోరీ లైన్ కూడా లేదు. ఓ ఇంటర్వ్యూలో గీతూ మాట్లాడుతూ.. రాసుకున్న స్క్రిప్ట్ ను ఎప్పుడూ తీయలేదని చెప్పింది. అలాంటప్పుడు రాసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. “నేను రాసింది ఒకటి, తీసింది మరొకటి, ఎడిటింగ్ చేసింది ఇంకొకటి. మొత్తానికి సినిమా బయటకు వస్తోంది, నేను చాలా హ్యాపీ” అని చెప్పింది. ఏం తీయాలో క్లారిటీ లేని డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తే సినిమా ఇలాగే ఉంటుంది.
పాన్ ఇండియా హిట్ ‘కేజిఎఫ్ 2’ తర్వాత యష్ ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తాడని అందరూ ఎదురు చూశారు. రెండేళ్లు నెక్స్ట్ మూవీ ప్రకటించకుండా గీతూ మోహన్ దాస్ కు ఛాన్స్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. సరైన హిట్ మూవీ లేని గీతూ మోహన్ దాస్ కు ఛాన్స్ ఇవ్వడం ఫ్యాన్స్ కు నచ్చలేదు. అభిమానుల నమ్మకాన్ని గీతూ డిజాస్టర్ తో నిలబెట్టింది. యష్ ఎప్పుడు కనిపించినా తాగుతూనే ఉంటాడు. ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్, లేదంటే కత్తి, గన్ పట్టి రక్తపాతం సృష్టించడం.. ఈ మూడు పనులు తప్ప హీరోకు మరో పనే లేదు అన్నట్టుగా క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసుకుంది గీతూ. ఇలా 3 గంటల 14 నిమిషాల పాటు నడిపించి టార్చర్ కు మరో పేరుగా టాక్సిక్ తీసింది. కథ, క్యారెక్టరైజేషనే లేనప్పుడు ఇక యాక్టింగ్ కు స్కోప్ ఎక్కడ ఉంటుంది? క్యారెక్టర్స్ అన్నీ ఏదో ఒక సందర్భంలో బాధతో, కోపంతో థియేటర్ రీసౌండ్ వచ్చేలా గట్టిగా అరవడం తప్ప నటించిందేమీ లేదు. తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుందని, ‘టాక్సిక్’ ముందు, తర్వాత అని చెప్పుకుంటారని కియారా ప్రీ రిలీజ్ లో పేర్కొంది. అయితే కియారా కెరీర్ లో నదియా రోల్ మాయని మచ్చగా మిగిలిపోయింది.
Also Read
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో 'రష్మిక మందన్న'
- Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
తాజావార్తలు
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
-
Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!