Toxic: టాక్సిక్ నుంచి ఏ కంటెంట్ వచ్చినా, గ్లింప్స్ నుంచి ట్రైలర్ వరకు ప్రతి వీడియోలో రొమాన్స్ లేదంటే వైలెన్స్ హద్దులు దాటాల్సిందే. యష్ బర్త్ డే పిక్‌లో డ్రగ్స్, పబ్, రొమాన్స్ చుట్టూ తిప్పి మత్తులు ఊపేసింది. యష్ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో ఇంటిమసీ సీన్స్‌కు సింబాలిక్‌గా పెట్టిన షాట్స్ చూడలేనంత ఎబ్బెట్టుగా ఉండడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక టీజర్‌లో చెట్లు కట్ చేసే మిషన్‌తో పీకలు కోయడం, బండరాయితో తల బద్దలు కొట్టడం చూస్తూ ఉంటే, ఈ సినిమాకు ‘ఎ’ కంటే పెద్ద సర్టిఫికెట్ ఏదైనా ఉంటే అదే ఇవ్వాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. సెన్సార్ ఎన్ని కట్స్, బీప్స్, బ్లర్స్ వేస్తుంది, సెన్సార్ సర్టిఫికెట్ రావడం కూడా అంత ఈజీ కాదన్నారు. అయితే అందరికీ షాక్ ఇస్తూ ఎలాంటి కట్స్ లేకుండా టాక్సిక్‌కు ‘ఎ’ సర్టిఫికెట్ రావడం విశేషం.
కన్నడ, ఇంగ్లీష్ వెర్షన్‌లో సినిమా రూపొందగా, కన్నడలో మాత్రం రెండు పదాలను మ్యూట్ చేశారు. ఈ మధ్యకాలంలో సెన్సార్ కొత్త నిబంధనలు ఎన్నో ఆరోపణలకు దారితీశాయి. అవసరం లేకపోయినా కట్స్ ఇస్తున్నాయని మేకర్స్ వాపోతున్నారు. అయితే టాక్సిక్ సినిమాకు ఎలాంటి కట్స్ ఇవ్వకుండా క్లియరెన్స్ ఎలా ఇచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ లెక్కన టీజర్, ట్రైలర్, సాంగ్స్ హద్దులు దాటింది ఏదీ సినిమాలో లేదా అన్న మరో డౌట్ కూడా వస్తోంది. సినిమా నచ్చుతుంది చూడాలంటూ చిత్ర యూనిట్ ప్రమోషన్ చేస్తోంది. కానీ టాక్సిక్ దగ్గరికి వచ్చేసరికి సినిమా పెద్దలకు మాత్రమే, చిన్న పిల్లలు చూడొద్దంటూ ప్రచారం చేసింది. వీళ్లే ఇలా చెప్తున్నారంటే సినిమాలో చూడకూడని సీన్స్ ఎన్ని ఉన్నాయో అంటూ చర్చ మొదలైంది. నిర్మాత వెంకట్ కె. నారాయణ్ మాట్లాడుతూ, టాక్సిక్ అన్ని సినిమాల లాంటిది కాదన్నారు. ఇప్పటివరకు తీసిన సినిమాల్లో డిఫరెంట్ మూవీ అని చెప్తూనే, పెద్దల కోసం తీసిన సినిమా ఇదన్నారు. ఇక యష్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చిన్న పిల్లలు చూడొద్దని చెప్పేసాడు. మరి అడల్ట్స్ అయినా చూసేలా సినిమా ఉంటుందో లేదో తెలియాలంటే 26 వరకు ఆగాల్సిందే.

